STOCKS

News


రూపాయి స్వల్ప రికవరీ

Tuesday 9th October 2018
Markets_main1539058262.png-20942

రూపాయి మంగళవారం స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.89 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపు 74.07తో పోలిస్తే 0.25 శాతం లాభపడింది. రూపాయి మంగళవారం 73.85 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.986 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.975 శాతంగా ఉంది.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.6 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 3.42 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.25 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 1.8 శాతంమేర లాభపడింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.13 శాతం, ఇండోనేసియా రుపియ 0.11 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.06 శాతం క్షీణించాయి. అయితే చైనా రెన్‌మిన్‌బి 0.16 శాతం, జపాన్‌ యెన్‌ 0.1 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.08 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.761తో పోలిస్తే 0.01 శాతం క్షీణతతో 95.758 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఫేస్‌బుక్ నుంచి వీడియోకాలింగ్ పరికరం "పోర్టల్"

Tuesday 9th October 2018

లండన్‌: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే వీడియో కాలింగ్ పరికరం "పోర్టల్"ను ఆవిష్కరించింది. 10 అంగుళాల స్క్రీన్‌ కలిగిన పోర్టల్ రేటు 199 డాలర్లుగాను, 15 అంగుళాల వెర్షన్ ధర 349 డాలర్లుగాను ఉంటుంది. స్మార్ట్‌ స్పీకర్ మార్కెట్లో అమెజాన్‌, గూగుల్‌తో పోటీపడే క్రమంలో ఫేస్‌బుక్ దీన్ని రూపొందించింది. ప్రత్యేకంగా స్కీన్ ముందరే నిల్చోవాల్సిన అవసరం లేకుండా 'హేయ్ పోర్టల్' అని

లాభాలతో ఆరంభం..

Tuesday 9th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,474 పాయింట్లతో పోలిస్తే 147 పాయింట్ల లాభంతో 34,651 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,348 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్ల లాభంతో 10,390 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం (దక్షిణ కొరియా

Most from this category