STOCKS

News


రూపాయి పరుగుకు బ్రేక్‌

Saturday 13th April 2019
Markets_main1555134080.png-25105

- 25 పైసలు డౌన్‌
- 69.17 వద్ద క్లోజింగ్‌

ముంబై: వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన రూపాయి పరుగుకు బ్రేక్ పడింది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే 25 పైసలు క్షీణించి 69.17 వద్ద క్లోజయ్యింది. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించినట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దీనికి తోడు ఎస్సార్ స్టీల్‌ను ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేయడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిందన్న వార్తలతో రావాల్సిన విదేశీ నిధులకు బ్రేకులు పడొచ్చన్న అభిప్రాయాలూ నెలకొన్నట్లు వివరించారు. ఎస్సార్ స్టీల్ కొనుగోలు డీల్ విలువ దాదాపు 7 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి నెలకొన్నప్పటికీ, విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం, దేశీ ఈక్విటీ మార్కెట్లలో భారీగా కొనుగోళ్లు జరగడం కొంత మేర దేశీ కరెన్సీ క్షీణతకు అడ్డుకట్ట వేశాయని విశ్లేషకులు తెలిపారు. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజీ (ఫారెక్స్‌)లో 69.04 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభం కాగా.. ఒక దశలో 69.38 కనిష్ట స్థాయిని కూడా తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 0.25 పైసల క్షీణతతో 69.17 వద్ద క్లోజయ్యింది. 



You may be interested

పేయూ చేతికి అమెరికా విబ్‌మో కంపెనీ

Saturday 13th April 2019

డీల్‌ విలువ రూ.484 కోట్లు న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ చెల్లింపు సేవల కంపెనీ పేయూ, అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థ, విబ్‌మోను కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.484 కోట్లు(7 కోట్ల డాలర్లు). రెండు కంపెనీలు చేసే వ్యాపారాలు వేర్వేరు అని, అందుకని రెండు కంపెనీలు వేర్వేరుగానే తమ వ్యాపారాలను నిర్వహిస్తాయని పేయూ కంపెనీ తెలిపింది. విబ్‌మో సంస్థకు 20కు పైగా దేశాలకు చెందిన బ్యాంక్‌లతో భాగస్వామ్యం ఉందని, పేమెంట్‌ అథంటికేషన్‌

15 దాకా విదేశీ సేవల నిలిపివేత

Saturday 13th April 2019

- జెట్ ఎయిర్‌వేస్‌ నిర్ణయం - దేశీయంగా 6 విమానాలతోనే సర్వీసులు ముంబై: ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ సంక్షోభం మరింత ముదురుతోంది. తాజాగా విదేశీ రూట్లలో సర్వీసులను సోమవారం దాకా (ఏప్రిల్ 15) నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. ముందుగా శుక్రవారం మాత్రమే విదేశీ రూట్లలో సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ తాజాగా దాన్ని పొడిగించింది. నిధుల కొరత సమస్యలతో దీన్ని సోమవారం దాకా పొడిగించాలని సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Most from this category