STOCKS

News


రూపీ పతనం

Tuesday 23rd October 2018
Markets_main1540268181.png-21374

ఇండియన్‌ రూపాయి మంగళవారం కూడా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.73 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు 73.56తో పోలిస్తే 0.23 శాతం నష్టపోయింది. రూపాయి మంగళవారం 73.70 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.935 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.93 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.18 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.55 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.69 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 0.23 శాతంమేర లాభపడింది. 
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.67 శాతం, థాయ్‌ బట్‌ 0.28 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.25 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.20 శాతం, ఇండోనేసియా రుపియా 0.16 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.12 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.12 శాతం క్షీణించాయి.   
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.013తో పోలిస్తే 0.02 శాతం పెరుగుదలతో 96.036 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. 
 



You may be interested

25,000 కోట్ల సమీకరణ!

Tuesday 23rd October 2018

ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) రూ.25,000 కోట్లు సమీకరించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లు బాండ్ల (బాసెల్‌ 3 టైర్‌ టూ బాండ్స్‌) ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. క్యాపిటల్‌ అడిక్వెసీ (మూలధన) నిబంధనల ప్రమాణాలకు ధీటుగా ఈ నిధులను సమీకరించనున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్‌ తెలిపింది. తమ ఈ రెండు ప్రతిపాదనకు ఇప్పటికే బ్యాంక్‌

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌...10,160 స్థాయికి నిఫ్టీ

Tuesday 23rd October 2018

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌ 34,000 దిగువున ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,134 పాయింట్లతో పోలిస్తే 199 పాయింట్ల నష్టంతో 33,935 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,245 పాయింట్లతో పోలిస్తే 93 పాయింట్ల నష్టంతో 10,152 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది.  అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,

Most from this category