STOCKS

News


ఫ్లాట్‌గా రూపాయి

Friday 7th September 2018
Markets_main1536294145.png-20031

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. అయితే వెంటనే ఆ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.99 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు స్థాయి 71.99గా ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 71.92 వద్ద ప్రారంభమైంది. 72.04 స్థాయిని కూడా తాకింది. కాగా రూపాయి గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 72.11ని తాకింది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.048 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.056 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం 161 పాయింట్ల లాభంతో 38,404కు చేరింది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ దాదాపు 12.29 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 11 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 305.1 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.15 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ యెన్‌ 0.16 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.1 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.05 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.03 శాతం పెరిగాయి. అయితే ఫిలిప్పిన్స్‌ పెసో 0.13 శాతం, మలేసియా రింగిట్‌ 0.05 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.04 శాతం క్షీణించాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.021తో పోలిస్తే 0.01 శాతం క్షీణతతో 95.012 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నిస్సాన్‌లో నియామకాలు

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై వ్యయం పెంచుతున్నట్లు జపనీస్‌ ఆటో దిగ్గజం నిస్సాన్‌ వెల్లడించింది. భారత్‌లోని తమ చెన్నై ప్లాంట్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు  సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) ఏర్పాటుచేసిన సమావేశంలో తెలిపింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా, ఆఫ్రికా, మధ్యతూర్పు ప్రాంతాల చైర్మన్‌ పెయమన్‌ కార్గర్‌ మాట్లాడుతూ.. ‘మూవ్‌ 2022’ పేరిట రూపొందించిన

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇన్ఫోసిస్:- సింగపూర్‌ హోల్డింగ్‌ సంస్థతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనుంది. ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌:- బెంగళూర్‌ కంపెనీ గ్రాఫెన్‌ సెమికండక్టర్‌లో 100శాతం వాటాను రూ.93 కోట్లకు కొనుగోలు చేసింది. యస్‌ బ్యాంకు:- నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 11న మూలధన సమీకరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో డిబెంచర్ల జారీ ద్వారా నిధులను సమీకరించేందుకు కమిటీ యోచిస్తోంది. వెల్‌స్పాన్‌

Most from this category