STOCKS

News


రూపీ ఫ్లాట్‌..

Friday 5th October 2018
Markets_main1538712892.png-20868

ఇండియన్‌ రూపాయి శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. స్వల్ప నష్టాలతో ప్రారంభమైన రూపాయి వెంటనే రికవరీ అయ్యింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశపు నిర్ణయం శుక్రవారం వెలువడనుండటంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. కాగా ఆర్‌బీఐ వరుసగా మూడోసారి కూడా వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది.    
ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.59 వద్ద ట్రేడవుతోంది. మునపటి ముగింపు 73.58తో పోలిస్తే 0.01 శాతం క్షీణించింది. శుక్రవారం రూపాయి 73.64 వద్ద ప్రారంభమైంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 8.136 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 8.157 శాతంగా ఉంది.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.2 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 2.44 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.26 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 3.3 శాతంమేర లాభపడింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. తైవాన్‌ డాలర్‌ 0.23 శాతం, థాయ్‌ బట్‌ 0.21 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.12 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.09 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.07 శాతం క్షీణించాయి. అయితే చైనా రెన్‌మిన్‌బి 0.31 శాతం పెరిగింది. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.751తో పోలిస్తే 0.06 శాతం పెరుగుదలతో 95.812 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

12 నుంచీ కొత్త బడ్జెట్‌ కసరత్తు!

Friday 5th October 2018

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) బడ్జెట్‌ రూపకల్పనా కసరత్తు ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మొదట ఆర్థికశాఖ అధికారులు స్టీల్‌, విద్యుత్‌, హౌసింగ్‌, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యయాలు... సవరణలను ఖరారు చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరం ‍క్తొత ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు. నవంబర్‌ 16 వరకూ ఈ

మళ్లీ గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభం

Friday 5th October 2018

34,831 పాయింట్లకు సెన్సెక్స్‌  10,447  పాయింట్లకు నిఫ్టీ  ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ శుక్రవారం కూడా గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,169 పాయింట్లతో పోలిస్తే 72 పాయింట్ల నష్టంతో 35,097 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,599 పాయింట్లతో పోలిస్తే 85 పాయింట్ల నష్టంతో 10,514 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ల నష్టాలు కూడా

Most from this category