STOCKS

News


రూపీ ఫ్లాట్‌..

Wednesday 26th September 2018
Markets_main1537935590.png-20571

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం అక్కడక్కడే కదలాడుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం నేపథ్యం ఇందుకు కారణం. ఫెడ్‌ రేటు నిర్ణయం బుధవారం అర్ధరాత్రి వెలువడనుంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.73 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మంగళవారం ముగింపు 72.70తో పోలిస్తే 0.03 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 72.72 వద్ద ప్రారంభమైంది. 
ట్రేడర్లు.. అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచడం ఈ ఏడాది మూడోసారి అవుతుంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.12 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.126 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 12 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 1.26 బిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.78 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 8 శాతంమేర పెరిగింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.15 శాతం, థాయ్‌ బట్‌ 0.15 శాతం, మలేసియా రింగిట్‌ 0.1 శాతం, హాంగ్‌ కాంగ్‌ డాలర్‌ 0.06 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.04 శాతం తగ్గాయి. అయితే దక్షిణ కొరియా ఒన్‌ 0.25 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.22 శాతం, జపాన్‌ యెన్‌ 0.07 శాతం పెరిగాయి.   
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.133తో పోలిస్తే 0.02 శాతం పెరుగుదతో 94.149 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

బుధవారం వార్తలోని షేర్లు

Wednesday 26th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- రేటింగ్‌ సంస్థ మూడీస్‌ బ్యాంక్‌ అవుట్‌లుక్‌ రేటింగ్‌ను స్థిరత్వానికి సవరించింది. కల్లాం టెక్స్‌టైల్స్‌:- రెట్స్‌ ఇష్యూ అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 29న బోర్డు సమావేశం నిర్వహించనుంది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- కంపెనీ రూ.65కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. అలాగే రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ కంపెనీకి గల బ్యాంక్‌ ధీర్ఘకాలిక రుణ సదుపాయాలకీ, ఎన్‌డీలకు రేటింగ్‌ను ఎఎ(+)స్థిరత్వానికి పెంచింది. సెంట్రల్‌

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 26th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,652 పాయింట్లతో పోలిస్తే 284 పాయింట్ల లాభంతో 36,936 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,067 పాయింట్లతో పోలిస్తే 78 పాయింట్ల లాభంతో 11,145 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఫెడ్‌ పాలసీ సమావేశం నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లో ట్రేడవుతుండటం (దక్షిణ

Most from this category