STOCKS

News


నిలకడగా రూపీ

Tuesday 11th September 2018
Markets_main1536639976.png-20140

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం ప్రారంభంలో స్వల్పంగా బలపడింది. అయితే వెంటనే ఆ లాభాలు ఆవిరయ్యాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు వెలుడి కానుండటం, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.42 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 72.45తో పోలిస్తే 0.02 శాతం పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 72.30 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.145 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.158 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 11.85 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 405.6 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.34 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ 95 పాయింట్ల లాభంతో 38,017కు పెరిగింది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ 11.35 శాతం లాభపడింది.  
అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.25 శాతం, జపాన్‌ యెన్‌ 0.24 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.18 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.13 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.08 శాతం క్షీణించాయి. అయితే దక్షిణ కొరియా ఒన్‌ 0.21 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.09 శాతం పెరిగాయి.  
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.15తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదలతో 95.196 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

టార్సియస్‌లో 18 శాతం వాటా సన్‌ఫార్మాకు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: సన్‌ ఫార్మా కంపెనీ. ఇజ్రాయెల్‌కు చెందిన టార్సియస్‌ ఫార్మాలో 18.75 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ వాటాకు సమానమైన 3.45 లక్షల షేర్లను రూ.21 కోట్ల మేరకు (30 లక్షల డాలర్లకు) నగదులోనే కొనుగోలు చేయనున్నామని సన్‌ ఫార్మా తెలిపింది. ఈ నెల 15 కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొంది. కంటి జబ్బులకు సంబంధించిన ఔషధాల సెగ్మెంట్లో  టార్సియుస్‌ ఫార్మా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

లాభనష్టాల మధ్య సయ్యాట

Tuesday 11th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,922 పాయింట్లతో పోలిస్తే 95 పాయింట్ల లాభంతో 38,017 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,438 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 11,476 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు వెంటనే ఆవిరయ్యాయి. ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. అయితే మళ్లీ సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చాయి.  అమెరికా మార్కెట్లు సోమవారం

Most from this category