STOCKS

News


రూపీ రేంజ్‌ 70-74!

Wednesday 12th September 2018
Markets_main1536748067.png-20204

క్రూడ్‌ ధరలు పెరిగాయని, ఇవి ఈ ఏడాది అధిక స్థాయిల్లోనే ఉంటాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇందుకు కారణమని పేర్కొంది. సమీప కాలంలో డిమాండ్‌-సప్లై సమీకరణాలు క్రూడ్‌ ధరలను నిర్దేశిస్తాయని తెలిపింది. ఒపెక్‌ దేశాల నుంచి క్రూడ్‌ సరఫరా, అమెరికాలో ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు క్రూడ్‌ ధరల పరుగును కొంత అడ్డుకోవచ్చని అంచనా వేసింది. 
వెనిజుల వంటి దేశాల నుంచి క్రూడ్‌ ఉత్పత్తి తగ్గడం సహా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫిక్రా ప్రాంతంలో రాజకీయ అస్థిర పరిస్థితులు క్రూడ్‌ సరఫరాపై ప్రభావం చూపొచ్చని పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కూడా కీలకమని, దీని వల్ల క్రూడ్‌ ధరల్లో ఒడిదుడుకులు ఉంటాయని తెలిపింది. అధిక క్రూడ్‌ ధరల వల్ల ఆయిల్‌ అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు, ఐటీ, మెటల్స్‌ సంస్థలకు పాజిటివ్‌ అని పేర్కొంది. ఇక ఆయిల్‌ మార్కెటింగ్‌, గ్యాస్‌ యుటిలిటీ, లూబ్రికెంట్స్‌, టైల్స్‌, ప్లేవుడ్స్‌, పెయింట్స్‌, ప్లాస్టిక్‌ ప్రొడక్ట్స్‌, ఆటో, కొన్ని మిడ్స్‌క్యాప్‌ కంపెనీలకు నెగటివ్‌ అని తెలిపింది. 
రూపాయి విలువలో ఒడిదుడుకులు ఉంటాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఈ ఏడాది రెండు సార్లు రేట్లు పెంచడం, అమెరికా జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండటం, బలమైన డాలర్‌, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. రూపాయి 70-74 శ్రేణిలో కదలాడవచ్చని అంచనా వేసింది. రూపాయి పతనం వల్ల ఆయిల్‌ అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు, ఫార్మా, ఐటీ, మెటల్స్‌, పైప్స్‌, టెక్స్‌టైల్స్‌,  టైర్లు, గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ సంస్థలకు పాజిటివ్‌ అని పేర్కొంది. ఇక గ్యాస్‌ యుటిలిటీ, లూబ్రికెంట్స్‌, టైల్స్‌, ప్లేవుడ్స్‌, టెలికం, మీడియా, ఇన్‌ఫ్రా, బ్యాంకులు, సిమెంట్‌ కంపెనీలకు నెగటివ్‌ అని తెలిపింది.  



You may be interested

రూపాయి రికవరీతో నష్టాలకు బ్రేక్‌..!

Wednesday 12th September 2018

300 పాయింట్ల లాభపడి సెన్సెక్స్‌ రూపాయి అనూహ్య రికవరీ కారణంగా మార్కెట్‌ రెండు రోజుల భారీ పతనానికి బుధవారం బ్రేక్‌ పడింది. దీనికి తోడు హెవీ వెయిట్‌ షేర్లైన ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీ, ఆగస్ట్‌ నెల వాణిజ్యలోటు స్వల్పంగా తగ్గిందనే వార్తలు కూడా లాభాల సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ నుంచి  బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో

టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు..

Wednesday 12th September 2018

వచ్చే రెండేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు కలిగిన కంపెనీలు మంచి పనితీరు కనబర్చవని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవాని తెలిపారు. అందువల్ల మహీంద్రా ఫైనాన్స్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. మిడ్‌క్యాప్స్‌లో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు, వాహన విడిభాగాల కంపెనీలకు ప్రాధ్యానమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి మరింత బలహీనపడితే ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టపోతాయని తెలిపారు. సమీప

Most from this category