STOCKS

News


బలపడిన రూపాయి

Monday 3rd September 2018
Markets_main1535949121.png-19895

క్యూ1లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు (8.2 శాతం) అంచనాలు అధిగమించడంతో ఇండియన్‌ రూపాయి సోమవారం బలపడింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 70.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 71తో పోలిస్తే 0.23 శాతం పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 70.78 వద్ద ప్రారంభమైంది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం కొత్త జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. తొలిసారిగా 71 స్థాయికి పడిపోయింది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.942 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.952 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ సోమవారం 271 పాయింట్ల లాభంతో 38,916 వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ దాదాపు 13.47 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 10.04 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 282.6 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 5.6 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇండోనేసియా రుపియ 0.47 శాతం, మలేసియా రింగిట్‌ 0.36 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.11 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.1 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.06 శాతం క్షీణించాయి. అయితే ఫిలిప్పిన్స్‌ పెసో 0.14 శాతం, జపాన్‌ యెన్‌ 0.11 శాతం పెరిగాయి.  
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.14తో పోలిస్తే 0.02 శాతం పెరుగుదలతో 95.16 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు..!

Monday 3rd September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీసీ:- సెప్టెంబర్‌ 5న జరిగే బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల జారీ, ఇతర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై సెప్టెంబర్‌ 5న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. ఎల్‌ అండ్‌ టీ:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో నేడు రేపు(సెప్టెంబర్‌3, 4తేదీల్లో) ఫ్లోర్‌ షేరు ధర రూ.1,700ల వద్ద 59లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. క్వాలీటీ:- విదేశీ సంస్థాగత పెట్టుబడి కంపెనీల

జీడీపీ జోష్‌...గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 3rd September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,645 పాయింట్లతో పోలిస్తే 271 పాయింట్ల లాభంతో 38,916 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో  ప్రారంభమైంది.  నిఫ్టీ తన మునపటి ముగింపు 11,680 పాయింట్లతో పోలిస్తే 71 పాయింట్ల లాభంతో 11,751 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నా, గత శుక్రవారం సాయంత్రం విడుదలైన ప్రోత్సాహకర జీడీపీ డేటా కారణంగా భారత్‌ మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో

Most from this category