News


రూపీ @ 73... భవిష్యత్‌పై భిన్నాభిప్రాయాలు

Wednesday 7th November 2018
Markets_main1541577001.png-21769

ముంబై: రూపాయి తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సోమవారం ఒకేరోజు 67 పైసలు పతనమై 73.12కు చేరిన రూపాయి మంగళవారం తిరిగి కోలుకుంది. 12 పైసల లాభంతో 73 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకులు, క్రూడ్‌ ధరలు వంటి అంశాలు ఏరోజుకారోజు రూపాయిపై ప్రభావాన్ని చూపుతున్నాయి.  అక్టోబర్‌ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.  అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా, గత శుక్రవారం ఒక్కసారిగా రూపాయి 100 పైసలు లాభపడి 72.45 వద్ద ముగిసింది. సోమవారం ప్రారంభంలోనే 72.76 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి ఒక దశలో 73.13 స్థాయిని కూడా చూసింది. ఈ ఏడాది రూపాయి దాదాపు 13 శాతం నష్టపోయింది.
71 వైపు...‍క్రిసిల్‌
2019 మార్చి నాటికి 71 వరకూ బలపడే అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్‌ సం‍స్థ క్రిసిల్‌ పేర్కొంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిల నుంచి తగ్గడం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌తో 75 బిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ వంటి అంశాలనుకేర్‌ నివేదిక ప్రస్తావించింది. ​
కాదు 76...యూబీఎస్‌
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధిక స్థాయుల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76 స్థాయిని తాకొచ్చని స్విస్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది.  అయితే కొంత ఒడిదుడుకులు ఉండవచ్చని పేర్కొంది.
ఇప్పటికి తట్టుకున్నా.. మార్జిన్లపై ఇంకా భయాలే!
- రూపాయి పతనం నేపథ్యంలో
కంపెనీలపై ఎస్‌అండ్‌పీ విశ్లేషణ
డాలర్‌ మారకంలో రూపాయి భారీ పతన ప్రభావాన్ని తన రేటెడ్‌ భారత్‌ కంపెనీలు బ్యాంకులు తట్టుకోగలుగుతున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ- ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అయితే పతనం ఇదే రీతిన కొనసాగితే మాత్రం ఆయా సంస్థల మార్జిన్లు కరిగిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. తాజా నివేదికలోని ‍కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
-  పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంపెనీలు, బ్యాంకులు కరెన్సీ పతనాన్ని తక్షణం ఎదుర్కొనగలిగాయి. ఇందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి కారణం.
- అదే విధంగా భారత్‌ కంపెనీలు, బ్యాంకులు రూపాయి పతన ప్రభావాన్ని నిరోధించగలిగాయి. డాలర్‌ అనుసంధాన విదేశీ రుణాలు, లేదా ముందు జాగ్రత్తగా హెడ్జింగ్‌లు తీసుకోవడం దీనికి కారణం.
- అయితే మున్ముందు రూపాయి మరింత పతనంతో కష్టమే. ద్రవ్యోల్బణం, దిగుమతుల భారం వంటివి మార్జిన్లును కరిగిస్తాయి. ఇది బ్యాంకింగ్‌ రుణ నాణ్యతపై కూడా ప్రభావం చూపే అంశం. భారత్‌ బ్యాంకుల రికవరీని ఇది ఆలస్యం చేసే వీలుంది.
- వాణిజ్య ఉద్రిక్తతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్య పరపతి విధానాల కఠినతరం, వడ్డీరేట్ల పెంపు, డాలర్‌ పటిష్టత వంటి అంశాలు వర్థమాన మార్కెట్లకు సవాళ్లను విసురుతాయి. ప్రపంచ వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి.You may be interested

ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌ లాభం 13శాతం డౌన్‌

Wednesday 7th November 2018

-రూ.3,590 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.195 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.225 కోట్ల నికర లాభం వచ్చిందని, 13 శాతం క్షీణత నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,699 కోట్ల నుంచి రూ.3,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఆర్థిక సేవల

ఆర్‌బీఐ స్వతంత్ర​తను గౌరవించాల్సిందే..!

Wednesday 7th November 2018

- అది సీట్‌బెల్ట్‌ లాంటిది; పెట్టుకోకుంటే ప్రమాదం - ప్రభుత్వ ఒత్తిళ్లకు నో చెప్పే స్వేచ్ఛ దానికి ఉండాలి - బ్యాంక్‌ బోర్డు ద్రావిడ్‌లా ఆడాలి .. సిద్ధూలా కాదు - ద్రవ్యోల్బణం ఓకే... ఉద్యోగాల కల్పన పెరగాలి - లిక్విడిటీ సమస్య పరిష్కరించలేనంత పెద్దది కాదు - ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్‌ బ్యాంక్‌కు మధ్య రగులుతున్న వివాదంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పందించారు. రిజర్వ్‌

Most from this category