STOCKS

News


ఆరు రోజుల ఎత్తు నుంచి కిందకు..!

Wednesday 20th March 2019
Markets_main1553060414.png-24704

- 43 పైసల నష్టంతో
 రూ.68.96కు రూపాయి
- లాభాల స్వీకరణ కారణం!

ము‍‍ంబై: ఆరు ట్రేడింగ్‌ సెషన్ల వరుస రూపాయి ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 43పైసలు నష్టపోయి 68.96 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు వచ్చిన డిమాండ్‌ తాజా రూపాయి బలహీనతకు కారణాల్లో ఒకటని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు 161 పైసలు లాభపడ్డంతో, కొందరు ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని కూడా విశ్లేషణలు ఉన్నాయి. కాగా సోమవారం కీలక నిరోధాన్ని (68.50) అధిగమించిన రూపాయి, దీనిని మరుసటిరోజే నిలబెట్టుకోలేకపోవడం వల్ల తాజా ర్యాలీ మరింత కొనసాగడంపై అనుమానాలూ ఉన్నాయి.  ఈ సందర్భంగా క్రూడ్‌ ధరలు భారీగా పెరుగుతున్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 68.53 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్‌ ఒక దశలో 69.05ను కూడా చూసింది.  
నేటి ఫెడ్‌ నిర్ణయం దిశా నిర్దేశం
బుధవారం  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ సమావేశం, ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 2.25-2.50 శాతం శ్రేణి)పై నిర్ణయం డాలర్‌ ఇండెక్స్‌ కదలికలు రూపాయి తదుపరి భవిష్యత్‌ను నిర్దేశించే వీలుంది. సమీప కాలంలో 68-69.50 శ్రేణిలో రూపాయి కదలికలు ఉండే వీలుందని ఆనంద్‌ సేథీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ కమోడిటీ, కరెన్సీ విభాగ విశ్లేషకులు రుషభ్‌ మారూ అభిప్రాయపడ్డారు. 74.39 కనిష్టం నుంచి అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 13 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72-70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమై, వారం రోజులుగా ఆసియాలోనే చక్కటి పనితీరును ప్రదర్శిసో​‍్తంది. అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. You may be interested

స్టార్టప్స్‌కి ఏం సందేశమిస్తున్నట్లూ..

Wednesday 20th March 2019

 సొంతంగా ఓ గొప్ప ఐటీ సంస్థను నిర్మించుకోలేరా - బలవంతపు టేకోవర్‌తో ఏం సాధించాలనుకుంటున్నారు - ఎల్‌అండ్‌టీపై మైండ్‌ట్రీ ప్రమోటర్ల ఘాటు వ్యాఖ్యలు బెంగళూరు: బలవంతపు టేకోవర్‌ యత్నాలు చేస్తున్న లార్సన్ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)పై ఐటీ సంస్థ మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు నిప్పులు చెరిగారు. దిగ్గజ సంస్థ అయి ఉండి .. సొంతంగా ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీని నిర్మించుకోలేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి బలవంతపు టేకోవర్ ప్రయత్నాలతో విశ్వసనీయత.. నిజాయితీ గల

ఈ పరుగులు చాలాఏళ్లుంటాయ్‌!

Wednesday 20th March 2019

భారత మార్కెట్లు బహుళసంవత్సర ర్యాలీకి రెడీగా ఉన్నాయని ఈక్విటీ ఇంటిలిజెన్స్‌ ఎండీ పొరింజు వెలియత్‌ చెప్పారు. పదేళ్ల కన్సాలిడేషన్‌ అనంతరం మార్కెట్లు మరలా జూలు విదులుస్తున్నాయన్నారు. ఈదఫా ర్యాలీ కనీసం 4-5 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. మార్కెట్లు ఇప్పటికీ పూర్తిగా భారత ఎకానమీలోని సంపూర్ణ పాజిటివ్‌ అంశాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. దేశీయ పెట్టుబడిదారుల కన్నా ఎఫ్‌పీఐలే ఇండియాపై ఎక్కువ నమ్మకంతో ఉన్నారన్నారు. గత ఇరవై రోజుల్లో ఎఫ్‌ఐఐలు ఇండియా

Most from this category