News


రూపీ 11పైసలు డౌన్‌

Friday 14th June 2019
Markets_main1560488992.png-26280

 శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 69.61 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పై ప్రభావం చూపాయి.  రూపీ ఆరంభమే బలహీనంగా 69.55 వద్ద మొదలైంది. గురువారం రూపీ 69.50 వద్ద క్లోజయింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో రూపీ స్వల్ప శ్రేణిలో ట్రేడవుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ కరెన్సీలతో డాలర్‌ బలపడడం కూడా రూపీపై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ నిధుల వెల్లువ రూపీని కొంతమేర ఆదుకుంటోంది.

 

 



You may be interested

ఏడాది కనిష్టాలకు ఆర్‌ క్యాప్‌, ఆర్‌హోమ్‌ఫైనాన్స్‌

Friday 14th June 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం 52 వారాల కనిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ 7శాతం నష్టంతో రూ.78.10 వద్ద ట్రేడవుతోంది.  రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ నాలుగు శాతం నష్టంతో రూ.14.30 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ కాపిటల్, రిలయన్స్‌ హోం, ఫైనాన్‌ కంపెనీలకు ఆడిటింగ్‌ సేవలందించే పీడబ్యూసీ అకస్మాత్తుగా ఆ సేవల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దృష్ఠి

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 14th June 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు వోక్ హార్డ్‌:- మ‌హారాష్ట్ర యూనిట్‌కు యూఎస్ఎఫ్‌డీఏ జీరో అబ్జర్వేష‌న్ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజీల‌కు స‌మాచారం ఇచ్చింది.  ఈ జూన్ 10-12 తేదిలో యూఎస్ఎఫ్‌డీఏ త‌నిఖీలు నిర్వహించిన‌ట్లు తెలిపింది.  రిల‌య‌న్స్ హోమ్ ఫైనాన్స్:- పీడ‌బ్ల్యూసీ పరిశీలనలు పూర్తిగా నిరాధారమైనవి, అన్యాయమైనవి. ఆడిట్ క‌మిటితో ముందుగా ఎలాంటి చ‌ట్టబ‌ద్ధమైన చ‌ర్చలు జ‌ర‌ప‌లేద‌ని రిల‌య‌న్స్ హోమ్స్  అధికార ప్రతినిధులు వివ‌ర‌ణ‌నిచ్చారు.  నాగార్జున ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్:- కంపెనీ

Most from this category