STOCKS

News


రూపాయి: మళ్లీ ఆల్‌టైమ్‌ కనిష్టానికి

Thursday 30th August 2018
Markets_main1535603197.png-19774

ఇండియన్‌ రూపాయి క్షీణిస్తూనే ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం మరో కొత్త జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆసియా కరెన్సీ మార్కెట్లు నష్టాల్లో ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 70.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 70.59తో పోలిస్తే 0.16 శాతం క్షీణించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.69 వద్ద ప్రారంభమైంది. 
కాగా రూపాయి బుధవారం 49 పైసలు మేర క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.59 రికార్డ్‌ కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. డాలర్‌ బలమైన డిమాండ్‌ నేపథ్యంలో ఒకానొక సమయంలో 70.65 ఆల్‌టైమ్‌ కనిష్టానికి కూడా పతనమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.929 శాతంగా ఉంది. బుధవారం నాటి ముగింపు స్థాయి 7.918 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇండియా సావరిన్‌ బాండ్లుపై ఒత్తిడి పెరగొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదలను ఇందుకు కారణంగా పేర్కొంది.
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ గురువారం మార్నింగ్‌ సెషన్‌లో 74 పాయింట్ల లాభంతో 38,797 వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ దాదాపు 15 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 9.76 శాతం మేర బలహీన పడింది. వర్ధమాన కరెన్సీల్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 256.45 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.96 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. చైనా రెన్‌మిన్‌బి 0.18 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.10 శాతం, థాయ్‌ బట్‌ 0.09 శాతం, ఇండోనేసియా రూపియా 0.06 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.05 శాతం, మలేసియా రింగిట్‌ 0.07 శాతం, హాంగ్‌కాంగ్‌ డాలర్‌ 0.001 శాతం క్షీణించాయి.   
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.60తో పోలిస్తే 0.03 శాతం క్షీణతతో 94.572 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

వచ్చే నెల 4న ఎల్‌ఐసీ బోర్డ్‌ మీటింగ్‌

Thursday 30th August 2018

న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ డైరెక్టర్ల సమావేశం వచ్చే నెల 4న జరుగనున్నది. రుణభారంతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు సంబంధించిన విధి విధానాలు చర్చించడానికి ఈ సమావేశం జరగనుంది. ఓపెన్‌ ఆఫర్‌ను ఎప్పుడు ఇవ్వాలి, బోర్డ్‌లో ఎవరిని నియమించాలి. ఐడీబీఐ బ్యాంక్‌ను నష్టాల బాట నుంచి తప్పించడానికి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం ఐడీబీఐ

లాభాలు అంతలోనే నష్టాలు

Thursday 30th August 2018

బుధవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ మార్కెట్లు గురువారం పాజిటివ్‌గానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,723 పాయింట్లతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో 38,797 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,692 పాయింట్లతో పోలిస్తే 3 పాయింట్ల స్వల్ప లాభంతో 11,695 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30 సమయంలో సెస్సెక్స్‌ 31 పాయింట్ల

Most from this category