STOCKS

News


22 పైసలు పతనమైన రూపాయి

Saturday 15th December 2018
Markets_main1544849502.png-22957

ముంబై: డాలర్‌తో రూపాయి విలువ శుక్రవారం 22 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటం, స్టాక్‌ మార్కెట్‌ బలహీనంగా ఉండటంతో రూపాయి డీలా పడిందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఆర్‌బీఐ డైరెక్టర్ల సమావేశం శుక్రవారం జరగడంతో ఫారెక్స్‌ మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నదని ట్రేడర్లు తెలిపారు. 
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం నష్టాల్లో ప్రారంభమైంది. గురువారం 71.68 వద్ద ముగిసిన రూపాయి శుక్రవారం 12 పైసల నష్టంతో 71.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మరింతగా (56 పైసలు)నష్టపోయి 72.04కు పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకుంది. చివరకు 22 పైసల నష్టంతో 71.90 వద్ద ముగిసింది. గురువారం రూపాయి 33 పైసలు పతనమైంది. ఈ రెండు రోజుల్లో రూపాయి మొత్తం 55 పైసలు క్షీణించింది. 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఎస్‌బీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Saturday 15th December 2018

ముంబై: తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఎస్‌బీఐ ఆదేశించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా రుణాలను తీసుకోగా, ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా ఉంది. చమురు ధరల పెరుగుదలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ గత మూడు త్రైమాసికాలుగా రూ.1,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేస్తోంది. తీవ్ర స్థాయిలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న ఈ సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలను

ఈ-కామర్స్‌లోకి ఇండియా పోస్ట్‌

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: పోస్టల్‌ కార్యకలాపాలు నిర్వహించే ఇండియా పోస్ట్ తాజాగా పూర్తి స్థాయిలో ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఉత్పత్తుల డెలివరీకి తమ పార్సిల్‌ విభాగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోనుంది. "ప్రత్యేకంగా పార్సిల్ డైరెక్టరేట్ ఏర్పాటు ద్వారా పోస్టల్ విభాగంలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను సులభతరం చేశాం. పార్సిల్‌ రేటు, తత్సంబంధిత నిబంధనలపై ఇది వేగవంతంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇంటి వద్దకే ఉత్పత్తుల డెలివరీ చేసే క్రమంలో ఇండియా పోస్ట్ తన విస్తృత

Most from this category