News


రెండు వారాల గరిష్టంలో రూపీ

Wednesday 17th October 2018
Markets_main1539749544.png-21216

ఇండియన్‌ రూపాయి బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.42 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన మంగళవారం ముగింపు 73.47తో పోలిస్తే 0.1 శాతం లాభపడింది. రూపాయి బుధవారం 73.34 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.885 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.873 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.36 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.42 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 3.25 శాతంమేర లాభపడింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. చైనా రెన్‌మిన్‌బి 0.17 శాతం, థాయ్‌ బట్‌ 0.13 శాతం, జపాన్‌ యెన్‌ 0.13 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.1 శాతం, మలేసియా రింగిట్‌ 0.03 శాతం తగ్గాయి. అయితే దక్షిణ కొరియా ఒన్‌ 0.3 శాతం, ఇండోనేసియా రుపియ 0.11 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.048తో పోలిస్తే 0.14 శాతం పెరుగుదలతో 95.183 వద్ద ట్రేడవుతోంది. 
ట్రేడర్లు.. ఫెడరల్‌ రిజర్వు సెప్టెంబర్‌ సమావేశపు మినిట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవి బుధవారం విడుదల కానున్నాయి.  
 



You may be interested

జీపీఎఫ్‌ వడ్డీరేటు 0.4 శాతం పెంపు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: జనరల్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి

నిఫ్టీ 100 పాయింట్ల గ్యాప్‌అప్‌

Wednesday 17th October 2018

35,500 పాయింట్లకు పైన సెన్సెక్స్‌ 10,700 మార్క్‌ తాకిన నిఫ్టీ   ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాల్గవ సెషన్‌ బుధవారం కూడా లాభాలతోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,162 పాయింట్లతో పోలిస్తే 381 పాయింట్ల లాభంతో 35,543 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,543 పాయింట్లతో పోలిస్తే 104 పాయింట్ల లాభంతో 10,688 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,710

Most from this category