STOCKS

News


రూపీ అప్‌.

Monday 17th December 2018
Markets_main1545021580.png-22985

ఇండియన్‌ రూపాయి సోమవారం లాభాల్లో ట్రేడవుతోంది. బంగారం దిగుమతులు క్షీణించడంతో వాణిజ్య లోటు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఉదయం 9:15 సమయంలో రూపాయి 71.84 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (శుక్రవారం) స్థాయి 71.90తో పోలిస్తే 0.08 శాతం క్షీణించింది. ఇకపోతే రూపాయి సోమవారం 71.85 వద్ద ప్రారంభమైంది. 

అక్టోబర్‌లో 17.13 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు నవంబర్‌లో 16.67 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. నవంబర్లో బంగారం దిగుమతులు 15.59 శాతం క్షీణతతో 2.76 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.438 శాతం వద్ద ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.441 శాతంగా ఉంది. 

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 5.6 శాతం పెరిగింది. ఇక ఇదే సమయంలో రూపాయి 11 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.55 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్ల నుంచి 7.36 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 

 ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఫిలిప్పిన్స్ పెసో 0.21 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.16 శాతం, థాయ్ బట్ 0.16 శాతం, సింగపూర్ డాలర్ 0.1 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.06 శాతం పెరిగాయి. ఇండోనేసియా రుపియా 0.16 శాతం, జపాన్ యెన్ 0.09 శాతం తగ్గాయి. 

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 97.443తో పోలిస్తే 0.04 శాతం క్షీణతతో 97.408 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

వృద్ధిబాటలో లాజిస్టిక్స్‌

Monday 17th December 2018

దేశంలోని ప్రధాన రంగాల్లో లాజిస్టిక్స్ కూడా ఒకటి. దేశ జీడీపీలో దాదాపు 13 శాతం వాటాను ఆక్రమించింది. ఇటీవలి మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే.. గత రెండేళ్లలో రియల్ ఎస్టేట్లోని మొత్తం ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్లలో వేర్హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ విభాగం దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంది. గత కొన్నేళ్లుగా లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన సంస్కరణలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలో కెల్లా 2017-18ని లాజిస్టిక్స్ కు

వేదాంతకు.....స్టెరిలైట్‌ రీ-ఓపెనింగ్‌ వెలుగులు

Monday 17th December 2018

6.50శాతం ర్యాలీ లాభపడిన షేరు తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారం శాశ్వత మూసివేత ఆదేశాలను జాతీయ హరిత ట్రెబ్యునల్‌ రద్దు చేయడంతో వేదాంత లిమిటెడ్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6శాతం ర్యాలీ చేసింది. తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని స్టెరిలైట్‌ను వెంటనే మూసివేయాల్సిందిగా ఈ ఏడాది మే నెలలో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రమవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో

Most from this category