STOCKS

News


35 పైసలు పుంజుకున్న రూపాయి

Friday 2nd November 2018
Markets_main1541131920.png-21649

  • డాలరుతో 73.10 వద్ద ప్రారంభం

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఉదయం 35 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 73.10 దగ్గర ప్రారంభమయ్యింది. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనం కావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి విలువ పుంజుకుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు వివరించారు. ఇదే సమయంలో దేశీ మార్కెట్‌లు భారీ లాభాల్లో ప్రారంభం కావడం కూడా రూపాయి విలువను నిలబెట్టిందన్నారు. ఇక గురువారం నాటి మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 50 పైసలు బలపడి 73.45 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 2nd November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టీసీఎస్‌:- లండన్‌కు చెందిన వీ12 స్టూడియో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. కోల్‌ ఇండియా:- ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో వాటా విక్రయ ప్రక్రియ గురువారం పూర్తి చేసింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 3.18శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5300 కోట్లను సమీకరించింది. ఐనాక్స్‌ లైస్యూర్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.241.71 చొప్పున మొత్తం 64లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లకు

10450లపై ప్రారంభమైన నిఫ్టీ

Friday 2nd November 2018

ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభంతో ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 10450పైన ప్రారంభమయ్యాయి. చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియాలో కూడా అన్ని మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. అంతర్జాతీయంగా

Most from this category