25 పైసలు బలపడిన రూపాయి
By Sakshi

డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ఎక్స్ఛేంజ్లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 25 పైసలు బలపడి 68.32 దగ్గర ప్రారంభమయ్యింది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం, దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభంకావడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగి రూపాయి విలువ బలపడిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు తెలియజేశారు. నిఫ్టీ 11,070 పాయింట్లను అధిగమించడం లాంటి సానుకూల వాతావరణంలో ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను అమ్మేందుకు క్యూ కట్టడం వల్ల రూపాయి మారకం విలువ 3 వారాల గరిష్టస్థాయిని నమోదుచేసిందని తెలియజేశారు. గురువారం ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ ముగింపు సమయానికి రూపాయి విలువ 20 పైసలు బలపడి 68.57 వద్ద నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మారకం విలువ ఏకంగా 6.7 శాతం పతనమయ్యింది.
You may be interested
శుక్రవారం వార్తల్లోని షేర్లు
Friday 13th July 2018వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఫోర్టీస్ హెల్త్‌కేర్:- అనేక పరిమాణాల అనంతరం మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బిడ్డింగ్‌కు ఆమోదం తెలిపింది. తాజాగా బిడ్డింగ్ ద్వారా ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ సంస్థ ఫోర్టీస్ హెల్త్‌కేర్‌లో రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్:- ప్రతి షేరు ధర రూ.1100ల చొప్పున మొత్తం 3.63 కోట్ల ఈక్విటీ షేర్ల బై బ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్
97 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్
Friday 13th July 20180.70 శాతం లాభాల్లో ఉన్న నిఫ్టీ ఐటీ 0.02 శాతం లాభపడి 27,032 వద్ద ట్రేడవుతోన్న బ్యాంక్ నిఫ్టీ ముంబై: దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 11,050 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా.. సెన్సెక్స్ 97 పాయింట్లు లాభపడి 36,645 దగ్గర ప్రారంభమయ్యింది. 9 గంటల 30 నిమిషాల సమయానికి నిఫ్టీ 39 పాయింట్లు (0.38 శాతం) లాభపడి 11,064 దగ్గర ట్రేడవుతోంది. 11,071