STOCKS

News


రూపాయి... తీవ్ర ఒడిదుడుకులు!

Saturday 5th January 2019
Markets_main1546684510.png-23427

  •  48 పైసలు లాభంతో 69.72కు రికవరీ

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 48 పైసలు బలపడి 69.72 వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో రూపాయి విలువ 77 పైసలు బలహీనపడి 69.43 నుంచి 70.20కి పడిపోయింది. శుక్రవారం మళ్లీ 48 పైసలు రికవరీతో 70.20 నుంచి 69.72కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ,  ఆరు ప్రధాన దేశాల కరెన్సీలతో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనధోరణి, ఎగుమతిదారులు, బ్యాంకర్ల డాలర్‌ అమ్మకాల ఒత్తిడి వంటివి శుక్రవారం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. శుక్రవారం రూపాయి ట్రేడింగ్‌ పటిష్టంగా 69.95 వద్ద ప్రారంభమైంది. తరువాత 69.66 వరకూ బలపడినా, కొంత వెనక్కుతగ్గి ట్రేడింగ్‌ చివరకు 69.72 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుత శ్రేణి 2.25 శాతం నుంచి 2.5 శాతం శ్రేణి) పెంపు ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్న ఊహాగానాలు, అమెరికా వృద్ధి అవకాశాలు మందగమనంలోకి జారుకుంటాయన్న విశ్లేషణలు డాలర్‌ ఇండెక్స్‌ బలహీనతకూ, రూపాయి సానుకూల సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటోంది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 69.90 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ ఇండెక్స్‌ 96.17 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

నిల్చిన రూ. 2వేల నోట్ల ముద్రణ

Saturday 5th January 2019

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ అనంతరం ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్ల ముద్రణను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది. అవసరాలకు అనుగుణంగానే నోట్ల ముద్రణ ఉంటుందని, ప్రస్తుతానికి తగినంత స్థాయిలో రూ.2,000 నోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు. "ప్రస్తుతం వ్యవస్థలో రూ.2,000 నోట్లు అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం నోట్ల విలువలో ఇవి 35 శాతంగా ఉంటాయి. రూ. 2,000 నోట్ల

మోదీ మంత్రం వినిపించడంలేదు!

Saturday 5th January 2019

మార్కెట్‌కు సుస్థిర ప్రభుత్వం కావాలి అంబరీశ్‌ బాలిగా గత ఎన్నికల సందర్భంగా కనిపించిన మోదీ మాయాజాలం ఈ దఫా కనిపించడంలేదని మార్కెట్‌ నిపుణుడు అంబరీశ్‌ బాలిగా చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ బాగా పుంజుకుందన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సుస్థిర ప్రభుత్వం ఏర్పడడమే మార్కెట్లకు కావాలన్నారు. కొత్త ఏడాదిపై తాను పాజిటివ్‌గా ఉన్నానని, కొత్త ప్రభుత్వం ఎకానమీకి మద్దతుగా నిలుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో

Most from this category