STOCKS

News


రూపాయి రికవరీ

Saturday 25th August 2018
Markets_main1535168561.png-19616

రూపాయి శుక్రవారం రికవరీ అయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ఇండియన్ మార్కెట్‌లో 20 పైసలు బలపడి 69.91 వద్ద ముగిసింది. కార్పొరేట్స్‌, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌లోని తీవ్రమైన ఒడిదుడుకులు రూపాయిపై త్రీవంగా ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం 70.20 వద్ద ప్రారంభమైన రూపాయి తర్వాత ఒకానొక సమయంలో 70.24 స్థాయికి కూడా పతనమైంది. అమెరికా-చైనా ప్రతినిధుల మధ్య గురువారం ముగిసిన వాణిజ్య చర్చల్లో ఎలాంటి చెప్పుకోదగ్గ పరిణామాలు చోటుచేసుకోకపోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. అందువల్ల రూపాయి కూడా బలహీనపడింది. అయితే చివరకు 20 పైసలు బలపడి 69.91 వద్ద ముగిసింది. వాణిజ్య లోటు పెరడగం, కరెంట్‌ ఖాతాపై నెలకొని ఉన్న ఆందోళనలు నెగటివ్‌ ప్రభావం చూపాయి. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల భయాల వల్ల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కూడా పెరిగాయి. ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో శుక్రవారం అర్ధరాత్రి రూపాయి విలువ 69.76కి బలపడింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి పాజిటవ్‌గా ప్రారంభం కావొచ్చు. ఇక వారం మొత్తంగా చూస్తే రూపాయి 24 పైసలు బలపడింది. 



You may be interested

దివాలా అంచున దిగ్గజాలు..

Saturday 25th August 2018

ఢిల్లీ: మొండిపద్దుల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన డెడ్‌లైన్‌ దగ్గరపడుతుండటంతో .. భారీగా రుణాలు పేరుకుపోయిన సంస్థలపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది.  దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇందులో పంజ్‌లాయిడ్, రిలయన్స్‌ డిఫెన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బజాజ్‌ హిందుస్తాన్‌ వంటి కంపెనీలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఆర్‌బీఐ సర్క్యులర్‌ ప్రభావం..  రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల

ఆసియా మార్కెట్లు మిశ్రమం

Saturday 25th August 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగానే ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225, దక్షిణ కొరియా కొస్పి, చైనా షాంఘై కంపొసిట్‌ మినహా మిగతా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225.. 191  పాయింట్ల లాభంతో 22,602 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 11 పాయింట్ల లాభంతో 2,293 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల లాభంతో 2,729 పాయింట్ల

Most from this category