STOCKS

News


రూపాయి రికవరీ..

Thursday 13th September 2018
Markets_main1536814812.png-20230

ముంబై: ప్రతి రోజూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ అసంబద్ధ స్థాయికి పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే, రూపాయి మరింత పతనం కాకుండా ప్రభుత్వం, ఆర్‌బీఐ తగు చర్యలు తీసుకుంటాయని, ఈ వారాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ట్వీట్ చేయడం కొంత ఊతమిచ్చింది. ఆగస్టులో వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గి 17.4 బిలియన్ డాలర్లకు పరిమితం కావడం కూడా రికవరీకి తోడ్పడింది. దాదాపు 73ని దాటేసే స్థాయికి చేరడంతో ఆర్‌బీఐ జోక్యం చేసుకుని పరిస్థితి కొంత చక్కదిద్ది ఉండొచ్చని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దీంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయి నుంచి 105 పైసలు ఎగిసి ఒక దశలో 71.86 స్థాయిని తాకింది. చివరికి 0.70 శాతం లాభంతో 72.18 వద్ద క్లోజయ్యింది. మే 25 తర్వాత ఒక్క రోజులో రూపాయి ఇంతగా బలపడటం ఇదే తొలిసారి. 



You may be interested

పోటీ సంస్థలపై ఫోన్‌పే విమర్శల దాడి

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన చెల్లింపుల సంస్థ ఫోన్‌పే... ప్రత్యర్థి కంపెనీలపై విమర్శలకు దిగింది. డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌ను భారత పన్ను చట్టం కిందకు తీసుకువచ్చే ఆర్‌బీఐ డేటా లోకలైజేషన్‌ను అవి వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించింది. డేటాను తప్పనిసరిగా స్థానికంగానే స్టోర్‌ చేయాలన్న ఆర్‌బీఐ నిబంధన వల్ల... యూజర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని సెర్చ్‌, మ్యాప్స్‌, షోషల్‌ మీడియా సేవలను ఆఫర్‌చేసే గూగుల్‌, ఫేస్‌బుక్‌ నుంచి భారత యూజర్ల పేమెంట్‌ డేటాకు రక్షణ

జీవిత బీమా పాలసీల్లో వృద్ధి

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: నూతన జీవిత బీమా పాలసీ ప్రీమియం వసూళ్లు ఆగస్టులో 6.43 శాతం పెరిగి రూ.18,639.29 కోట్లుగా నమోదైనట్లు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. గతేడాది ఇదే కాలానికి రూ.17,513.59 కోట్ల నూతన ప్రీమియం వసూళ్లు నమోదయ్యాయి. దేశీయంగా ఉన్న 24 జీవిత బీమా సంస్థలలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ నూతన పాలసీ ప్రీమియం వసూళ్లు 1.94 శాతం తగ్గుదలను నమోదుచేయగా, మిగిలిన 23

Most from this category