News


మళ్లీ 70 దిగువకు రూపాయి

Saturday 29th December 2018
Markets_main1546055913.png-23302

ముంబై: రూపాయి మళ్లీ చక్కటి రికవరీతో 70కన్నా దిగువకు వచ్చింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం 69.95 వద్ద ముగిసింది. గురువారంతో పోల్చితే ఇది 40 పైసలు రికవరీ. గురువారం ముగింపు 70.35. డిసెంబర్‌ 20న రూపాయి 69.70 వద్ద ముగిసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఆరు ప్రధాన విదేశీ కరెన్సీలతో డాలర్‌ బలహీనత, క్రూడ్‌ ధరలు తిరిగి ఇప్పుడే భారీగా పెరగబోవన్న విశ్లేషణలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లు వరుసగా మూడవరోజు లాభాల బాటన పయనించడం కూడా రూపాయి బలోపేతానికి కారణమయ్యింది. ట్రేడింగ్‌ మొదట్లోనే రూపాయి పటిష్ట ధోరణిలో 70.05 వద్ద ప్రారంభమైంది. 69.89-70.12 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది.



You may be interested

పీవీఆర్‌ రూ.750 కోట్ల సమీకరణ

Saturday 29th December 2018

-త్వరలో క్యూఐబీలకు షేర్ల జారీ - వాటాదారుల ఆమోదం కోరిన కంపెనీ న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ థియేటర్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న పీవీఆర్‌ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్‌ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29

ప్రాక్టీస్‌ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!

Saturday 29th December 2018

- మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనాలోనూ సేవలు - త్వరలో ఐఐటీ, ఐఐఎంలతో పాటు, కంపెనీలతోనూ ఒప్పందం - 6 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరణ పూర్తి - ‘స్టార్టప్‌ డైరీ’తో ఇంటర్వ్యూబడ్డీ ఫౌండర్‌ ఉజ్వల్‌ ప్రాక్టీస్‌ మేక్స్‌ పర్‌ఫెక్ట్‌! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్‌ ప్రెసిడెంట్స్, హెచ్‌ఆర్‌ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ వంటి ఉన్నతాధికారులతో

Most from this category