STOCKS

News


రూపాయి క్షీణత..

Monday 12th November 2018
Markets_main1541997112.png-21880

ఇండియన్‌ రూపాయి బలహీనపడింది. కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణంకాల వెల్లడి నేపథ్యంలో సోమవారం రూపాయి నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తన మునపటి (శుక్రవారం) ముగింపుతో పోలిస్తే 0.33 శాతం క్షీణతతో 72.74 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 72.50గా ఉంది. ఇక రూపాయి సోమవారం 72.68 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.787 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.763 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 3.23 శాతంమేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 12 శాతంమేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.68 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.74 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.41 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.28 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.21 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.19 శాతం, మలేసియా రింగిట్‌ 0.15 శాతం, జపాన్‌ యెన్‌ 0.13 శాతం, థాయ్‌ బట్‌ 0.05 శాతం నష్టపోయాయి.  
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.905తో పోలిస్తే 0.08 శాతం పెరుగుదలతో 96.985 వద్ద ట్రేడవుతోంది. 
రూపాయి గతవారం రోజులుగా రౌంజ్‌బౌండ్‌లో కదలాడుతూ వచ్చింది. అమెరికా మధ్యంతర ఎన్నికలు, ఫెడరల్‌ రిజర్వు పాలసీ సమావేశం వంటి ప్రధాన ఈవెంట్స్‌ జరిగాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత డాలర్‌ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. కాగా అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ.. ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్)లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ.. సెనేట్‌లో ఆధిక్యం సాధించింది. ఇక అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లపు యథాతథంగానే కొనసాగించింది. దీంతో ఫండ్‌ రేటు 2-2.5 శాతం శ్రేణిలోనే స్థిరంగా ఉంది. అయితే ఫెడరల్‌ రిజర్వు డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని సాంకేతాలిచ్చింది. 
సోమవారం అమెరికా డాలర్‌, ఇండియన్‌ రూపాయి మారక విలువ 72.50-73.10 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 12th November 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్లు ఇవే..! బయోకాన్‌:- బెంగళూర్‌లో ఔషధ తయారీ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ జీరో అబ్జర్వేషన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు కంపెనీ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ యూనిట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ నవంబర్‌ 05-09 తేదిల్లో తనిఖీలు చేసింది. నాట్కో:- షేర్ల బై బ్యాక్‌ ఇష్యూ ప్రారంభమైంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి రూ.250 కోట్లకు మించకుండా షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. సిప్లా:- వ్యాధి నిరోధక

లాభాల బోణి

Monday 12th November 2018

10,600 మార్క్‌కు పైన నిఫ్టీ సెన్సెక్స్‌ 130 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,585 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,607 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,158 పాయింట్లతో పోలిస్తే 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధర

Most from this category