STOCKS

News


రూపీ డౌన్‌

Wednesday 5th December 2018
Markets_main1543983417.png-22631

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయి పైకి వెళ్లడం వంటి అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. అలాగే నేటి ఆర్‌బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9:05 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.31 శాతం తగ్గుదలతో 70.74 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 70.51గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.67 వద్ద ప్రారంభమైంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.558 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.573 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 6.41 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 9.41 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.87 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.79 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా ఆర్థిక వృద్ధి రేటుపై నెలకొన్న ఆందోళనలు, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.84 శాతం, ఇండోనేసియా రుపియా 0.65 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.45 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.41 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.34 శాతం, మలేసియా రింగిట్‌ 0.25 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.23 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.21 శాతం, జపాన్‌ యెన్‌ 0.2 శాతం, థాయ్‌ బట్‌ 0.07 శాతం నష్టపోయాయి.  
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.965తో పోలిస్తే 0.16 శాతం పెరుగుదలతో 97.122 వద్ద ట్రేడవుతోంది. 
కాగా నేటి పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచొచ్చని అంచనాలున్నాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 5th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:- లుపిన్:- ప్రోస్టేట్‌ గ్రంథి చికిత్సలో వినియోగించి సిలోడిన్‌ ఔషధాలను అమెరికాలో విడుదల చేసింది. కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌:- తన టైర్ల వ్యాపారాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది. అయిల్‌ ఇండియా:- మనదేశంలో మొదటిసారిగా రాజస్థాన్‌లోని ‘‘భాఘ్‌వాలా’’బావుల్లో సైక్లిక్‌ స్టీమ్‌ స్టిమ్యూలేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున క్రూడాయిల్‌ను వెలికితీసింది. ట్రిగన్‌ టెక్నాలజీస్‌:- తన హోల్డింగ్‌ కంపెనీకి మధ్యంతర డివిడెండ్‌ను జారీ చేసింది. టీసీఎస్‌:- డిజిటల్‌ అనుసంధానిత వినియోగ వ్యవహారాల కోసం

నష్టాల ఆరంభం

Wednesday 5th December 2018

నిఫ్టీ 60 పాయింట్లు డౌన్‌ 36,000 దిగువున సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,869 పాయింట్లతో పోలిస్తే 49 పాయింట్ల నష్టంతో 10,820 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,134 పాయింట్లతో పోలిస్తే 99 పాయింట్ల నష్టంతో 36,035 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:24

Most from this category