STOCKS

News


స్వల్ప నష్టాల్లో రూపీ

Monday 19th November 2018
Markets_main1542600863.png-22158

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. నేడు జరగనున్న రిజర్వు బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.11 శాతం క్షీణతతో 72 వద్ద ట్రేడవుతోంది. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 71.93గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.93 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.82 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.816 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 11.2 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.3 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.72 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.17 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.17 శాతం, జపాన్‌ యెన్‌ 0.14 శాతం, ఇండోనేసియా రుపియ 0.05 శాతం పెరిగాయి. అయితే థాయ్‌ బట్‌ 0.32 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.18 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.05 శాతం క్షీణించాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.465తో పోలిస్తే 0.01 శాతం క్షీణతతో 96.461 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 19th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి జెట్‌ ఎయిర్‌వేస్‌:- టాటాసన్స్‌ జెట్‌ఎయిర్‌వేస్‌ కొనుగోలుపై ఎట్టకేలకు స్పందించింది. చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని త్వరలో నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటామని టాటాసన్స్‌ స్పష్టం చేశారు. వోడాఫోన్‌:- సంస్థ ఫైబర్‌ ఆస్తులను భారతీఇన్ఫ్రాటెల్‌కు విక్రయిస్తున్నట్లు వెలువడిన వార్తలను ఖండించింది. తమ ఫైబర్‌ ఆస్తులను ఎవరికి విక్రయించడటం లేదని శుక్రవారం సంస్థ స్పష్టం చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌:-  ఆంధ్రప్రదేశ్‌లోని యూనిట్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో

10,700 పైన నిఫ్టీ

Monday 19th November 2018

గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,682 పాయింట్లతో పోలిస్తే 49 పాయింట్ల లాభంతో 10,731 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,457 పాయింట్లతో పోలిస్తే 190 పాయింట్ల లాభంతో 35,647 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం

Most from this category