STOCKS

News


రూపీ దిగువకు

Friday 19th October 2018
Markets_main1539922312.png-21281

ఇండియన్‌ రూపాయి శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.63 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన బుధవారం ముగింపు 73.61తో పోలిస్తే 0.18 శాతం నష్టపోయింది. రూపాయి శుక్రవారం 73.62 వద్ద ప్రారంభమైంది. కాగా గురువారం దసరా సందర్భంగా మార్కెట్లకు సెలవు.
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.887 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.912 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.23 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.51 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.61 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 2.12 శాతంమేర లాభపడింది. 
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, యూవాన్‌ బలహీనపడుతూ రావడం వంటి అంశాల నేపథ్యంలో ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.18 శాతం, జపాన్‌ యెన్‌ 0.16 శాతం, మలేసియా రింగిట్‌ 0.11 శాతం నష్టపోయాయి. అయితే సింగపూర్‌ డాలర్‌ 0.18 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.09 శాతం, థాయ్‌ బట్‌ 0.06 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.06 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.90తో పోలిస్తే 0.06 శాతం పెరుగుదలతో 95.954 వద్ద ట్రేడవుతోంది. 
 



You may be interested

అనలిస్టుల నుంచి టాప్‌ ట్రేడింగ్‌ ఐడియాలు

Friday 19th October 2018

మార్కెట్లు అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా నెగిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్న సమయం నుంచి సూచీల్లో రికవరీ కనిపించవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో స్వల్పకాలానికి పలు ట్రేడింగ్‌ ఐడియాలను ప్రముఖ బ్రోకరేజ్‌లు అందిస్తున్నాయి. బొనాంజా పోర్టుఫోలియో రికమండేషన్లు: 1. ఎంఒఐఎల్‌: టార్గెట్‌ రూ. 187. స్టాప్‌లాస్‌ రూ. 165. 2. విప్రో: టార్గెట్‌ రూ. 349. స్టాప్‌లాస్‌ రూ. 308.  3. జీఈ పవర్‌: టార్గెట్‌ రూ. 866. స్టాప్‌లాస్‌ రూ. 752.  ఏయూఎం క్యాపిటల్‌ రికమండేషన్లు: 1. డెన్‌ నెట్‌వర్క్స్‌:

మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌..

Friday 19th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,779 పాయింట్లతో పోలిస్తే 216 పాయింట్ల నష్టంతో 34,563 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,453 పాయింట్లతో పోలిస్తే 114 పాయింట్ల నష్టంతో 10,339 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది.   ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు ఇప్పుడు యూరోపియన్‌ కమిషన్‌ అమెరికా- సౌదీ

Most from this category