STOCKS

News


రూపీ డౌన్‌..

Tuesday 16th October 2018
Markets_main1539663309.png-21178

ఇండియన్‌ రూపాయి మంగళవారం కూడా స్వల్పంగా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.89 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు 73.82తో పోలిస్తే 0.1 శాతం నష్టపోయింది. రూపాయి మంగళవారం 73.77 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.945 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.923 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.5 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.36 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.40 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 2.37 శాతంమేర లాభపడింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ యెన్‌ 0.18 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.12 శాతం, హాంగ్‌కాంగ్‌ డాలర్‌ 0.04 శాతం క్షీణించాయి. అయితే దక్షిణ కొరియా ఒన్‌ 0.58 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.1 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.1 శాతం లాభపడ్డాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.059తో పోలిస్తే 0.08 శాతం పెరుగుదలతో 95.14 వద్ద ట్రేడవుతోంది. 
 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 16th October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సౌతిండియా బ్యాంక్‌:- బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణమైన టైర్‌-2 బాండ్ల జారీ ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలని బోర్డు నిర్ణయించింది. గ్లోబల్‌ స్పిరిట్స్‌:- బీహార్‌ యూనిట్‌ను పునరుద్ధరించి వాణిజ్య ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. టీవీ టుడే నెట్‌వర్క్స్‌:- తన అనుబంధ సంస్థ ఇండియా టుడే ఆన్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.69 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌:-

లాభాలతో బోణి..

Tuesday 16th October 2018

35,000 పాయింట్లకు పైన సెన్సెక్స్‌ 10,550 వద్ద నిఫ్టీ ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,865 పాయింట్లతో పోలిస్తే 139 పాయింట్ల లాభంతో 35,004 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,512 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 10,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   వడ్డీ రేట్లు సహా కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై నెలకొని ఉన్న

Most from this category