STOCKS

News


రూపాయి అప్‌

Friday 16th November 2018
Markets_main1542344845.png-22066

ఇండియన్‌ రూపాయి వరుసగా నాల్గవ సెషన్‌లోనూ బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పెరిగింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 0.07 శాతం పెరుగుదలతో 71.92 వద్ద ట్రేడవుతోంది. రూపాయి గురువారం ముగింపు స్థాయి 71.98గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి శుక్రవారం 72.01 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.765 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.756 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 11.3 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.57 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.77 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. థాయ్‌ బట్‌ 0.16 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.1 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.12 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.1 శాతం క్షీణించాయి. అయితే ఇండోనేసియా రుపియ 0.43 శాతం, జపాన్‌ యెన్‌ 0.23 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.07 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.927తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదలతో 96.978 వద్ద ట్రేడవుతోంది. 

బ్యాంకులు, ఎగుమతిదారులు అమెరికా డాలర్లను విక్రయించడం రూపాయిపై సానుకూల ప్రభావం చూపింది. దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమవ్వడం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం, ఇతర దేశాల కరెన్సీలతో డాలర్‌ బలహీనపడటం వంటి అంశాలు కూడా రూపాయి లాభాలకు కారణంగా నిలిచాయని ట్రేడర్లు పేర్కొన్నారు. 



You may be interested

బజాజ్‌ అలయంజ్‌ నుంచి రెండు కొత్త ఉత్పాదనలు!

Friday 16th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రెండు కొత్త పాలసీలను తమ సంస్థ తేనున్నదని, అవి ఐఆర్‌డీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అపాయింటెడ్‌ యాక్చువరీ సాయి శ్రీనివాస్‌ ధూలిపాళ తెలిపారు. ఇందులో ఒకటి యులిప్‌ పాలసీ అని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం 25 రకాల పాలసీలను అందుబాటులో ఉంచిందని గురువారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘‘ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఇండివిడ్యువల్‌ విభాగంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ 9.9

బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు

Friday 16th November 2018

మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ లాభపడుతూ సూచీల ర్యాలీకి బాసటగా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1శాతం లాభపడింది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (26155)తో పోలిస్తే 26300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 11 షేర్లలో 9 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు

Most from this category