News


రూపీ డౌన్‌..

Monday 22nd October 2018
Markets_main1540181416.png-21337

ఇండియన్‌ రూపాయి సోమవారం స్వల్పంగా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.36 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 73.33తో పోలిస్తే 0.05 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 73.41 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.93 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.922 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 12.89 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.46 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.67 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 0.76 శాతంమేర లాభపడింది. 
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. థాయ్‌ బట్‌ 0.14 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.14 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.05 శాతం నష్టపోయాయి. అయితే సింగపూర్‌ డాలర్‌ 0.05 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.02 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.02 శాతం పెరిగాయి.  
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.713తో పోలిస్తే 0.04 శాతం క్షీణతతో 95.673 వద్ద ట్రేడవుతోంది. 
 



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 22nd October 2018

ఆయా వార్తలకు అనుగుణంగా సోమవారంనాటి ట్రేడింగ్‌లో ప్రభావితమయ్యే షేర్లివి... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: నికరలాభం 20.6 శాతం వృద్ధితో రూ. 5005 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం అంతేశాతం వృద్ధితో రూ. 11,763 కోట్లకు పెరిగింది. స్థూల ఎన్‌పీఏలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే స్థిరంగా 1.33 శాతం వద్ద వున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్‌: నికరలాభం 43.7 శాతం జంప్‌చేసి రూ. 193 కోట్లకు పెరిగింది. పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌: క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 22nd October 2018

సెన్సెక్స్‌ 370 పాయింట్లుకుపైగా జంప్‌ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 10,400కుపైన ప్రారంభం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,315 పాయింట్లతో పోలిస్తే 374 పాయింట్ల లాభంతో 34,689 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,303 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 10,405 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. అయితే వెంటనే ఇండెక్స్‌ లాభాలు

Most from this category