STOCKS

News


క్షీణించిన రూపాయి

Monday 5th November 2018
Markets_main1541391599.png-21694

ఇండియన్‌ రూపాయి సోమవారం బలహీనపడింది. ఆసియా కరెన్సీలు నష్టపోవడం, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌పై నెలకొన్న ఊహాగానాలు, అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా బాగుండటం వంటి అంశాలు ఇందుకు కారణం. ఉదయం 9:05 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.78 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 72.44తో పోలిస్తే 0.52 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 72.88 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.78 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.781 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 12.24 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 5.63 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.38 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 2.8 శాతం లాభపడింది.  
ఆసియా కరెన్సీలు దాదాపుగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఫిలిప్పిన్స్‌ పెసో 0.36 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.27 శాతం, మలేసియా రింగిట్‌ 0.22 శాతం, హాంగ్‌ కాంగ్‌ డాలర్‌ 0.19 శాతం, థాయ్‌ బట్‌ 0.19 శాతం, ఇండోనేసియా రుపియ 0.15 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.13 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.12 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.09 శాతం క్షీణించాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.542తో పోలిస్తే 0.05 శాతం తగ్గుదలతో 96.498 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఐటీసీ కొనచ్చు..

Monday 5th November 2018

భెల్‌     అమ్మేయండి  బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ. 73 టార్గెట్‌ ధర: రూ.60 ఎందుకంటే:  విద్యుదుత్పత్తి, పారిశ్రామిక యంత్రాలను తయారు చేసే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈపీసీ(ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) కార్యకలాపాలు కూడా నిర్వహించే ఈ కంపెనీ ఈ క్యూ2 ఫలితాల్లో అమ్మకాలు మినహా మరే ఇతర అంశాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అమ్మకాలు 8

ప్రారంభంలో ఫ్లాట్‌.. వెంటనే నష్టాల్లోకి..

Monday 5th November 2018

35,000 మార్క్‌ దిగువున సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,553 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల లాభంతో 10,558 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,011 పాయింట్లతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 35,118 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:33 సమయంలో సెన్సెక్స్‌ 77 పాయింట్ల నష్టంతో

Most from this category