STOCKS

News


తగ్గిన రూపాయి

Thursday 25th October 2018
Markets_main1540442121.png-21457

  • 14 పైసలు నష్టంతో 73.30 వద్ద ప్రారంభం

ఇండియన్‌ రూపాయి గురువారం బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.31 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన బుధవారం ముగింపు 73.16తో పోలిస్తే 0.20 శాతం నష్టపోయింది. రూపాయి గురువారం 73.30 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.853 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.872 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.63 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 9.03 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 0.23 శాతం క్షీణించింది.  
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ యెన్‌ 0.15 శాతం, థాయ్‌ బట్‌ 0.15 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.07 శాతం పెరిగాయి. అయితే దక్షిణ కొరియా ఒన్‌ 0.42 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.1 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.06 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.06 శాతం క్షీణించాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.434తో పోలిస్తే 0.16 శాతం తగ్గుదలతో 96.279 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

పెరిగిన పసిడి

Thursday 25th October 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం 3నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపును అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ల నష్టాల ఓపెనింగ్‌ కారణంగా ఆసియాలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1,236.40 డాలర్ల వద్ద ప్రారభమైంది. ఇంట్రాడేలో క్రమంగా పసిడికి డిమాండ్‌ పెరగడంతో ఔన్స్‌ పసిడి ధర ఏకంగా ఏకంగా

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 25th October 2018

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌:- ప్రస్తుతం కంపెనీలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్టా‍్య రేటింగ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ రేటింగ్‌ను తగ్గించింది. ఇక్రాన్‌ ఇంటర్నేషనల్‌:- తన అనుబంధ సంస్థ ఇక్రాన్‌ ద్వారా రైట్‌ ఇష్యూ పద్దతిలో రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టింది. టాటా కెమికల్స్‌:- వ్యాపార కార్యకలాపాల నిమిత్తం సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్స్‌ రీసెర్చ్‌

Most from this category