STOCKS

News


రూపాయి మళ్లీ దిగువకు

Monday 24th September 2018
Markets_main1537763354.png-20492

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం క్షీణించింది. దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.49 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన శుక్రవారం ముగింపు 72.20తో పోలిస్తే 0.39 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 72.47 వద్ద ప్రారంభమైంది. 
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడంతో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం సహా పలు ఇతర అంశాలు  ప్రతికూల ప్రభావం చూపడంతో శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారిపోయిన విషయం తెలిసిందే. 
చైనాపై అమెరికా విధించిన కొత్త టారిఫ్‌లు సోమవారం నుంచే అమల్లోకి వస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం వంటి అంశాల నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.031 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.07 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 11.5 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 1.22 బిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.79 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.36 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.30 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.28 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.25 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.15 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.15 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.1 శాతం, థాయ్‌ బట్‌ 0.08 శాతం, మలేసియా రింగిట్‌ 0.08 శాతం క్షీణించాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.22తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదతో 94.263 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 24th September 2018

న్యూయార్క్‌:- ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. డాలర్‌ పెరుగుదల ఇందుకు కారణమవుతోంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 2 డాలర్లు నష్టపోయి 1,200.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాతో వాణిజ్య చర్చలు రద్దు చేసుకుంటున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే అమెరికా- చైనాపై విధించిన 200 బిలియన్‌ డాలర్ల దిగుమతి వాణిజ్య పన్ను నేటి నుంచి

లాభాల్లోంచి నష్టాల్లోకి

Monday 24th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,841 పాయింట్లతో పోలిస్తే 83 పాయింట్ల లాభంతో 36,924 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,143 పాయింట్లతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 11,164 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్‌ 114 పాయింట్ల నష్టంతో 36,727 పాయింట్ల వద్ద,

Most from this category