STOCKS

News


లాభాల్లో రూపీ

Thursday 15th November 2018
Markets_main1542255594.png-22013

ఇండియన్‌ రూపాయి వరుసగా మూడో సెషన్‌లోనూ బలపడింది. క్రూడ్‌ ధరల తగ్గుదల, ఆసియా కరెన్సీలు లాభపడటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 0.38 శాతం పెరుగుదలతో 72.06 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 72.31గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం 72.06 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.732 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.733 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 3.19 శాతంమేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 11.2 శాతంమేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.59 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.91 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫిలిప్పిన్స్‌ పెసో 0.39 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.23 శాతం, ఇండోనేసియా రుపియ 0.17 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.15 శాతం, మలేసియా రింగిట్‌ 0.13 శాతం, థాయ్‌ బట్‌ 0.13 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.12 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.11 శాతం, జపాన్‌ యెన్‌ 0.09 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.803తో పోలిస్తే 0.11 శాతం పెరుగుదలతో 96.911 వద్ద ట్రేడవుతోంది. 

క్రూడ్‌ ధరల క్షీణతతోపాటు కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపింది. ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌లో రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుండటం కూడా రూపాయికి పాజిటివ్‌ అంశమే. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు కూడా మెల్లగా భారత్‌ మార్కెట్‌లోకి తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 15th November 2018

వివిధ వార్తల్లోని అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి... ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- మహారాష్ట్రలోని తలోజా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ జీరో అ‍బ్జర్వేషన్‌ సర్టిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. తలోజా యూనిట్‌లో ఈ సెప్టెంబర్‌ 15-18తేదిలో యూఎస్‌ఎఫ్‌డీ తనిఖీలు నిర్వహించింది. పీసీ జ్యుయెలర్‌:- కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికరలాభం 38శాతం క్షీణించింది. ఈ క్యూ2లో నికరలాభం రూ.94కోట్లను నమోదు చేయగా, గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.154కోట్ల

ఫ్లాట్‌ ఓపెనింగ్‌

Thursday 15th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,576 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 10,580 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,141 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 35,145 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లోనే ముగియడం, లిక్విడిటీ సంబంధిత సమస్యల నుంచి

Most from this category