STOCKS

News


రూపీ కళకళ

Friday 7th December 2018
Markets_main1544157810.png-22713

ఇండియన్‌ రూపాయి శుక్రవారం లాభాల్లో ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆరంభంలోనే 34 పైసలు బలపడింది. 70.56 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది. 
క్రూడ్‌ ఆయిల్‌ ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరా తగ్గింపు తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. నాన్‌-ఒపెక్‌ హెవీవెయిట్‌ దేశమైన రష్యా నుంచి మద్దతు కోసం వేచి చూస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 59.65 వద్ద ట్రేడవుతోంది.
కాగా ఇండియన్‌ రూపాయి గురువారం 44 పైసలు క్షీణించి 70.90 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల పతనం ప్రతికూల ప్రభావం చూపింది. 
అమెరికా డాలర్‌- ఇండియన్‌ రూపాయి మారక విలువ శుక్రవారం 70.30- 71.20 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. 
అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు విరామం ప్రకటించవచ్చనే అంచనాలు డాలర్‌పై ఒత్తిడిని పెంచాయని పేర్కొంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.401 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.423 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 
శుక్రవారం సాయంత్రం ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి కానున్న నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 11న వెలువడుతాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇవి ముఖచిత్రం లాంటివని చెప్పొచ్చు.  
బెంచ్‌మార్స్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4 శాతం మేర లాభపడింది. 
ఇక ఈ ఏడాదిలో రూపాయి 9.33 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.91 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.57 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ దాదాపు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.3 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.27 శాతం, థాయ్‌ బట్‌ 0.21 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.14 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.06 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.04 శాతం, ఇండోనేసియా రుపియా 0.04 శాతం పెరిగాయి. అయితే జపాన్‌ యెన్‌ మాత్రం 0.06 శాతం నష్టపోయింది. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.81తో పోలిస్తే 0.01 శాతం క్షీణతతో 96.803 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th December 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి ఖాదీం ఇండియా:- రూ.30 కోట్ల వాణజ్య పేపర్ల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. కేడిల్లా హెల్త్‌కేర్‌, జైడస్‌వెల్‌నెస్‌:- కేడిల్లా హెల్త్‌కేర్‌ తన అనుబంధ సంస్థ జైడస్‌ వెల్‌నెస్‌ ‘‘షేర్‌ సబ్‌స్క్రిప్షన్‌ అగ్రీమెంట్‌’’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కంపెనీ జైడస్‌ కంపెనీకి చెందిన 85లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.1,382ల వద్ద సబ్‌స్క్రెబ్‌ చేసుకుంది. సాగర్‌ సిమెంట్స్‌:- ఈ నవంబర్‌లో

గ్యాప్‌అప్‌ మార్కెట్‌

Friday 7th December 2018

సెన్సెక్స్‌ 180 పాయింట్లు అప్‌ 10,650 సమీపంలో నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,601 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 10,644 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,312 పాయింట్లతో పోలిస్తే 182 పాయింట్ల లాభంతో 35,494 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.  అమెరికా క్రూడ్‌ నిల్వలు తగ్గడం వల్ల క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగానే ఉండటం,

Most from this category