STOCKS

News


రూపీ డౌన్‌..

Monday 24th December 2018
Markets_main1545624969.png-23184

ఇండియన్‌ రూపాయి సోమవారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో రూపాయి 70.21 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ముగింపు స్థాయి 70.18తో పోలిస్తే 0.03 శాతం నష్టపోయింది. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.292 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.277 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 

ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రూపాయి 9 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.46 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.01 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 

ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా ఆఫ్‌షోర్‌ 0.31 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.14 శాతం, జపాన్‌ యెన్‌ 0.14 శాతం, థాయ్‌ బట్‌ 0.14 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.11 శాతం పెరిగాయి. అయితే తైవాన్‌ డాలర్‌ 0.21 శాతం, మలేసియా రింగిట్‌ 0.14 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.12 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.05 శాతం తగ్గాయి.  
 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.956తో పోలిస్తే 0.19 శాతం క్షీణతతో 96.771 వద్ద ట్రేడవుతోంది. 

ఫెడరల్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ను పదవి నుంచి తప్పించేందుకు తనకు అధికారం ఉందా? అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ‍ట్రంప్‌.. క్యాబినెట్‌ సభ్యులను అడినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీని వల్ల అమెరికా డాలర్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ట్రంప్‌ మాట వినకుండా జెరోమ్‌ పావెల్‌ వడ్డీ రేట్ల పెంచుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. 



You may be interested

పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ కోసం ఆరు ఐటీ కంపెనీలఎంపిక

Monday 24th December 2018

న్యూఢిల్లీ: డిజిటల్‌ పౌర క్రెడిట్‌ రిజిస్ట్రీ (పీసీఆర్‌/పౌరుల రుణాల సమాచార కేంద్రం) ఏర్పాటుకు గాను ఆర్‌బీఐ ఆరు అగ్ర స్థాయి ఐటీ కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. వీటిల్లో టీసీఎస్‌, విప్రో, ఐబీఎం ఇండియా, క్యాప్‌ జెమిని, డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌, మైండ్‌ట్రీ ఉన్నాయి. ఈ ప్రతిపాదిత పీసీఆర్‌లో సెబీ, కార్పొరేట్‌ వ్యహారాల శాఖ, జీఎస్టీ నెట్‌వర్క్‌, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ల తరఫు నుంచి సమాచారం సైతం

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 24th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎఫ్‌ఎంజీసీ షేర్లు:- జీఎస్‌టీ మండలి శనివారం నిర్వహించిన సమావేశంలో 23 రకాల వస్తు, సేవల పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేటి ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంజీసీ షేర్లు ఫోకస్‌లో వుండొచ్చు. సిమెంట్స్‌ షేర్లు:- సిమెంట్‌ ధరపై జీఎస్‌టీని తగ్గించాలని జూలైలో కౌన్సిల్‌ చర్చించనా, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో సిమెంట్‌

Most from this category