STOCKS

News


రూపీ అప్‌

Wednesday 24th October 2018
Markets_main1540355592.png-21414

  • 40 పైసలు లాభంతో 73.17 వద్ద ప్రారంభం
  • కలిసొచ్చిన బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గుదల, క్రూడ్‌ ధరల క్షీణత

ఇండియన్‌ రూపాయి బుధవారం బాగా లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 40 పైసలు లాభంతో 73.17 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు దిగిరావడం.. బ్యాంకులు.. ఎగుమతిదారులు డాలర్లను ఎక్కువగా విక్రయించడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. రూపాయి మంగళవారం దాదాపు ఫ్లాట్‌గానే 73.57 వద్ద ముగిసింది. 
క్రూడ్‌ ధరలు దిగిరావడం వల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ఒత్తిడి తగ్గుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. 
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌కు ఏర్పడే డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేస్తామని సౌదీ అరేబియా ‍ప్రకటంచడంతో క్రూడ్‌ ధరలు బుధవారం 5 శాతం మేర పతనమయ్యాయి. క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 76.80 వద్ద ట్రేడవుతోంది. 
మంగళవారం రాత్రి క్రూడ్‌ ధరలు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్‌లో చోటుచేసుకున్న అమ్మకాలు.. డిమాండ్‌ వృద్ధిపై ఆందోళనలను రేకెత్తించడం సహా ఆయిల్‌ మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్లుగా క్రూడ్‌ను సరఫరా చేస్తామని సౌదీ అరేబియా ప్రకటించడం ఇందుకు కారణం. 
అమెరికా-రూపాయి మారకపు విలువ బుధవారం 73.05-73.50 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది.
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ బుధవారం దాదాపు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. మార్కెట్‌లో మరింత లిక్విడిటీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అక్టోబర్‌ 25న దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించడం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో బాండ్‌ ఈల్డ్స్‌ 7.851 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ గత ముగింపు 7.889 శాతంగా ఉంది. 


 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th October 2018

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వీఏ టెక్‌ వాబాగ్‌:- ఖతార్‌ దేశం నుంచి రూ.555 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. సన్‌ ఫార్మా:- సోరియాసిస్‌ చికిత్సలో వినియోగించే ఇలూమియా ఔషధాలను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- రూ.11 కోట్ల విలువైన 95 మెండి బకాయిల అకౌంట్లను విక్రయించింది. భారతి ఎయిర్టెల్‌:- ఆఫ్రికా యూనిటల్‌ ద్వారా రూ.1.25 కోట్లను సమీకరించింది. డీసీఎం శ్రీరామ్‌:- రాజస్థాన్‌ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. జైపీ

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 24th October 2018

సెన్సెక్స్‌ 350 పాయింట్లకి పైగా అప్‌ మళ్లీ 34,000 మార్క్‌ పైకి రికవరీ 130 పాయింట్లకుపైగా లాభపడిన నిఫ్టీ 10,250 మార్క్‌ పైకి బౌన్స్‌బ్యాక్‌ మంగళవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 33,847 పాయింట్లతో పోలిస్తే 356 పాయింట్ల లాభంతో 34,203 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,146 పాయింట్లతో పోలిస్తే 132 పాయింట్ల లాభంతో 10,278

Most from this category