STOCKS

News


రూపాయి డౌన్‌..

Monday 1st October 2018
Markets_main1538368105.png-20727

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం బలహీనంగా ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు ఎగయడం, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రూపాయి సోమవారం 12 పైసలు క్షీణతతో 72.60 వద్ద ప్రారంభమైంది. కాగా రూపాయి శుక్రవారం 72.48 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు వచ్చే నెల 4న ఉంచి అమల్లోకి రానుండటం వల్ల బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకాయి. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్‌ బలపడింది. ఫెడరల్‌ రిజర్వు ‍క్రమంగా వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తామని పేర్కొనడంతో అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతుందనే అంచనాలు ఇందుకు కారణం. యూరో, పౌండు, జపాన్‌ యెన్‌ నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 83.24 వద్ద ఉంది. మరోవైపు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

కాగా ఇండియన్‌ రూపాయి విదేశీ మార్కెట్‌లో మరింత పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.79 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Monday 1st October 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా సోమవారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 4డాలర్లు మేర నష్టపోయింది. ఫెడ్‌రిజర్వ్‌బ్యాంకు కీలక వడ్డీరేట్లను 2020 వరకు పలు విడతల్లో పెంచాలని  ప్రణాళికలు రూపోందించింది. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం 3వారాల గరిష్టానికి చేరుకుంది. నేడు 94.84 వద్ద స్థిరమైన ర్యాలీ చేస్తుంది.  భారత వర్తమాన కాలం

బంధన్‌ బ్యాంక్‌ 20 శాతం క్రాష్‌

Monday 1st October 2018

ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ షేరు సోమవారం మార్కెట్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. స్టాక్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌లోకి వెళ్లింది. దాదాపు 4,91,723 షేర్ల సెల్‌ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కొనేవాళ్లు లేరు. బంధన్‌ బ్యాంక్‌ షేరు ధర ఎస్‌ఎస్‌ఈలో 20 శాతం క్షీణతతో రూ.452కు పడిపోయింది.   లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ శుక్రవారం కఠిన చర్యలకు దిగింది.

Most from this category