STOCKS

News


ఆల్‌టైమ్‌ కనిష్టానికి సమీపంలో రూపీ

Tuesday 25th September 2018
Markets_main1537849456.png-20536

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం జీవిత కాల కనిష్ట స్థాయికి సమీపంలో ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన సోమవారం ముగింపు 72.63తో పోలిస్తే 0.44 శాతంమేర నష్టపోయింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 72.96 వద్ద ప్రారంభమైంది. 
క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయని, ద్రవ్యలోటు కట్టు తప్పుతుందని ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో అక్టోబర్‌ సమావేశంలో ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశముందని భావిస్తున్నారు.  
బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 81 డాలర్ల మార్క్‌కు దాటేసింది. 2014 నవంబర్‌ నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. ఆయిల్‌ మార్కెట్‌లో సరఫరా తగ్గడం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచేందుకు అనాసక్తి చూపడం ప్రతికూల ప్రభావం చూపింది. 
అలాగే ట్రేడర్లు.. అమెరికా ఫెడరల రిజర్వు సమావేశం నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచడం ఈ ఏడాది మూడోసారి అవుతుంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.131 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.122 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 12.2 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 1.11 బిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.72 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 6.6 శాతంమేర పెరిగింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనాపై అమెరికా కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన బెదిరింపు చర్యలను నిలిపివేసే దాకా వాణిజ్య చర్చలను కొనసాగించమని చైనా తెగేసి చెప్పడం నెగటివ్‌ ప్రభావం చూపాయి. ఇండోనేసియా రుపియ 0.28 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.19 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.04 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.09 శాతం, థాయ్‌ బట్‌ 0.09 శాతం, మలేసియా రింగిట్‌ 0.1 శాతం, జపాన్‌ యెన్‌ 0.04 శాతం క్షీణించాయి. అయితే చైనా ఆఫ్‌షోర్‌ 0.07 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.09 శాతం పెరిగాయి.  
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.185తో పోలిస్తే 0.15 శాతం పెరుగుదతో 94.329 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

బ్యాంకుల చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని  సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి. మొండిబాకీలను

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 25th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కజారియా కెమికల్స్‌:- తన అనుబంధ సంస్థ కజారియా ఫ్లోరోకెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 30లక్షల ఈక్విటీ షేర్లను రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. యూనికెమ్‌ ల్యాబ్స్‌:- రేటింగ్‌ సంస్థ ఇక్రా... యూనికెమ్‌ ల్యాబ్స్‌కు చెందిన రూ.30కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌కు ఎ(+) స్టేబుల్‌ అవుట్‌ లుక్‌ రేటింగ్‌ను కేటాయించింది. వక్రంగీ:- మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేట్‌ ఎఫైర్స్‌ శాఖ నుంచి ఎలాంటి

Most from this category