STOCKS

News


రూపాయి స్వల్ప రికవరీ

Wednesday 5th September 2018
Markets_main1536121629.png-19956

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా రికవరీ అయ్యింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతుండటం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.46 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 71.57తో పోలిస్తే 0.14 శాతం బలపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 71.45 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 71.39 గరిష్ట స్థాయిని, 71.47 కనిష్ట స్థాయిని తాకింది. 
అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్‌ గణాంకాలు అంచనాల కన్నా పటిష్టంగా ఉండటం వల్ల డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ ఫిబ్రవరి నుంచి చూస్తే గరిష్ట స్థాయికి పెరిగింది. అలాగే ప్రైస్‌ పెయిడ్‌ ఇండెక్స్‌ కూడా ఏడేళ్ల గరిష్ట స్థాయికి దగ్గరిలో ఉంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.045 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.063 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ బుధవారం 73 పాయింట్ల లాభంతో 38,221కు చేరింది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ దాదాపు 13.47 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 10.6 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 488.6 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 5.75 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మలేసియా రింగిట్‌ 0.16 శాతం, జపాన్‌ యెన్‌ 0.11 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.1 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.06 శాతం క్షీణించాయి. ఇక చైనా రెన్‌మిన్‌బి 0.11 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.08 శాతం, ఇండోనేసియా రుపియ 0.05 శాతం, థాయ్‌ బట్‌ 0.05 శాతం పెరిగాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.439తో పోలిస్తే 0.1 శాతం పెరుగుదలతో 95.457 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

హైదరాబాద్‌లో ‘ఎఫ్‌-16’ రెక్కల తయారీ

Wednesday 5th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భాగ్యనగరం మరో రికార్డును నమోదు చేయబోతోంది. అమెరికాకు చెందిన రక్షణ రక్షణ, ఏరోస్పేస్‌, టెక్నాలజీ దిగ్గజం లాఖీడ్‌ మార్టిన్‌... ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ల రెక్కల తయారీని హైదరాబాద్‌లో చేపట్టబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తారు. 2020 చివరి నుంచి వీటి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో (టీఏఎస్‌ఎల్‌) భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు లాఖీడ్‌ వెల్లడించింది. టీఏఎస్‌ఎల్‌కు హైదరాబాద్‌ సమీపంలోని మహేశ్వరం దగ్గరి ఏరోస్పేస్‌

నిఫ్టీ రెడ్‌.. సెన్సెక్స్‌ గ్రీన్‌..

Wednesday 5th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,157 పాయింట్లతో పోలిస్తే 35 పాయింట్ల లాభంతో 38,192 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,520 పాయింట్లతో పోలిస్తే 6 పాయింట్ల నష్టంతో 11,514 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగియడం, ఒక్క తైవాన్‌ ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లోనే ట్రేడవుతుండటం,

Most from this category