STOCKS

News


మూడు నెలల్లో 76కి రూపాయి: యూబీఎస్‌

Monday 5th November 2018
Markets_main1541393741.png-21703

ముంబై: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధిక స్థాయుల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76 స్థాయిని తాకొచ్చని స్విస్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. విదేశీ పెట్టుబడుల రాక తగ్గడం, అధిక క్రూడ్ రేట్లు తదితర అంశాల కారణంగా రూపాయి ఇప్పటికే 74 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ సుమారు 15 శాతం క్షీణించింది. "అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఇదే స్థాయిలో (బ్యారెల్‌కి 80 డాలర్ల పైగా) కొనసాగిన పక్షంలో రూపాయి బేరిష్‌గానే ఉండొచ్చన్న గత అంచనాలను కొనసాగిస్తున్నాం. వచ్చే మూడు నెలల్లో రూపాయి మారకం విలువ 76 స్థాయికి పడిపోయే అవకాశం ఉంది" అని యూబీఎస్‌ పేర్కొంది. ఐదేళ్ల క్రితం అనుసరించిన ఉదార ద్రవ్య, ఆర్థిక విధానాలే ప్రస్తుత స్థూల ఆర్థిక అసమానతలకు దారితీశాయని అభిప్రాయపడింది. వీటి కారణంగానే భారత రూపాయి.. బలహీన అయిదు కరెన్సీల్లో ఒకటిగా మారిందని పేర్కొంది. 2013తో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా కట్టడి చేసే స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది.



You may be interested

ప్రభుత్వ బ్యాంకులకు మరో రూ.54,000 కోట్లు

Monday 5th November 2018

న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు తగినంత మూలధనం సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాజా త్రైమాసికంలో ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా నిధులను ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది రెండో విడత మూలధన నిధుల్లో భాగంగా రుణ వృద్ధి పెంచేందుకు... ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థ(ఎంఎస్‌ఎంఈ)లకు రుణాలే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. ఎంఎస్‌ఎంఈలకు రూ. కోటి వరకూ రుణాలను

అదానీ చేతికి కేఈసీ బికనీర్‌ ట్రాన్స్‌మిషన్‌

Monday 5th November 2018

న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ అదానీ ట్రాన్స్‌మిషన్‌ తాజాగా కేఈసీ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌నకు చెందిన సంస్థను కొనుగోలు చేయనుంది. కేఈసీ బికనీర్‌ సికర్ ట్రాన్స్‌మిషన్‌ సంస్థలో (కేబీఎస్‌టీపీఎల్‌) కేఈసీ ఇంటర్నేషనల్‌కి ఉన్న మొత్తం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 227.50 కోట్లుగా ఉండనుంది. కేబీఎస్‌టీపీఎల్‌ ప్రాజెక్టు కింద 344 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేటీ) మేర ట్రాన్స్‌మిషన్

Most from this category