STOCKS

News


రూపాయి @ 100!!

Thursday 13th September 2018
Markets_main1536814230.png-20224

న్యూఢిల్లీ: రూపాయి విలువ పతనం మరింతగా కొనసాగుతుందని, వచ్చే పదేళ్లలో ఏకంగా 100కి కూడా పడిపోయే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టరు మార్క్‌ ఫేబర్‌ అంచనా వేశారు. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుత రూపాయి పతనానికి ఇతర ఆసియా కరెన్సీల క్షీణతతో పాటు భారత ద్రవ్య పరపతి విధానం కూడా కారణమని ఆయన చెప్పారు. భారత్‌లో కఠినతర పరపతి విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో చాలా మంది.. ముఖ్యంగా స్టాక్‌మార్కెట్‌కు సంబంధించిన వారు.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను విమర్శిస్తుంటారని ఫేబర్‌ తెలిపారు. ‘‘కానీ డాలర్‌–రూపాయిని స్థిరీకరించిన రాజన్‌ను నేను ప్రశంసించా. భారత స్టాక్స్‌ విలువలు ప్రస్తుతం చాలా ఖరీదుగా ఉన్నాయి.  వచ్చే ఏడాది వ్యవధి.. ఆ పై కాలంలో మార్కెట్‌ కరెక్షన్‌కు లోనుకావొచ్చు. పలు స్టాక్స్‌ తమ ఆదాయాలకు 50 రెట్లు అధిక స్థాయిలో ట్రేడవుతున్నాయి. అందుకని వచ్చే ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలో మార్కెట్లు మరింతగా పెరగడం కన్నా, తగ్గే అవకాశాలే ఉన్నాయి’’ అని ఫేబర్‌ వివరించారు.



You may be interested

పరిశ్రమల పురోగతి - ధరల తగ్గుదల

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్‌ 5న పాలసీ సమీక్ష

ఐటీలో భద్రతా వ్యవస్థ లేమి..!

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: ధృడమైన భద్రతా వ్యవస్థ లేకపోవడం వల్లే భారత ఐటీ సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్నట్లు వెల్లడయింది. ప్రమాద, సమగ్ర నిర్వహణ సంస్థ నేత్రికా కన్సల్టెంగ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. తాము సర్వే చేపట్టిన కంపెనీలలో 65 శాతం సైబర్ దాడులకు బలమైన భద్రతా వ్యవస్థ లేకపోవడమే కారణమని తేలినట్లు ఈ సంస్థ వెల్లడించింది. 18 శాతం కంపెనీలు మాత్రమే 25 మందికి మించిన నిపుణులతో భద్రతా

Most from this category