STOCKS

News


రూపాయికి శుభ ‘అంచనా’!

Tuesday 20th November 2018
Markets_main1542685028.png-22206

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి పయనం ఎటు వెళుతుందోనన్న ఆర్థిక వర్గాల అంచనా, ఆందోళనల నేపథ్యంలో- ప్రముఖ ఆర్థిక సేవల దిగ్గజం సిటీగ్రూప్‌ అమెరికా డాలర్‌ కదలికకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2019లో డాలర్‌ గరిష్ట పరిమితికి చేరుతుందని, అటు తర్వాత వెనక్కు తిరిగే అవకాశం ఉందని సిటీగ్రూప్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే జరిగితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న భారత్‌ రూపాయికి ఇది శుభవార్తే. సిటీగ్రూప్‌ అంచనాల్లో కీలక అంశాలను చూస్తే...
♦ జీ-10 దేశాల (బెల్జియం, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, నెథర్లాండ్స్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌) కరెన్సీలతో అమెరికా కరెన్సీ ఈ ఏడాది ర్యాలీ చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మూడు సార్లు పెంచిన ఫెడ్‌ ఫండ్‌ రేటు, కంపెనీల లాభాలు బాగుండడం దీనికి నేపథ్యం. 
♦ అయితే వచ్చే ఏడాది డాలర్‌ బలహీనపడే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు దీనికి కారణం కావచ్చు. వచ్చే మూడు నెలల్లో మరో ఒకశాతం పెరిగినా, వచ్చే ఆరు నుంచి 12 నెలల కాలంలో జీ-10 దేశాల కరెన్సీలపై దాదాపు 2 శాతం డాలర్‌ పతనమయ్యే వీలుంది. 
♦ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వల్ల తిరిగి అమెరికా వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ఇది డాలర్‌ బలహీనతకు దారితీసే అంశమే. 
♦ రుణ విస్తృతి, ఈక్విటీ ధరల పతనం, సావరిన్‌ బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల వంటి అంశాల నేపథ్యంలో- డాలర్‌ బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం- మోర్గాన్‌ స్టాన్లీ విదేశీ మారకద్రవ్య వ్యవహారాల వ్యూహకర్త హాన్స్‌ డెరీకర్‌ కూడా ఒక విశ్లేషణా పత్రంలో పేర్కొనడం గమనార్హం. డాలర్‌ బుల్‌ రన్‌ పూర్తయ్యిందని, ఇది కరెన్సీ షార్టింగ్‌ కాలమనీ కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. You may be interested

రెండున్నర నెలల గరిష్టానికి రూపాయి

Tuesday 20th November 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంకింగ్‌ ట్రేడింగ్‌లో సోమవారం వరుసగా ఐదవ రోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ రూపాయి బలపడింది. ఒకేరోజు 26 బలపడి 71.67కు చేరింది. ఇది పది వారాల గరిష్ట స్థాయి. విదేశీ నిధుల ప్రవాహం, గరిష్ట స్థాయిల నుంచి 20 డాలర్ల వరకూ క్రూడ్ ధరలు పతనం వంటి అంశాలు రూపాయి బలపడ్డానికి దారితీస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ప్రారంభంలో 9

గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి?

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆహారం, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ తప్పనిసరికాదు. హాల్‌మార్కింగ్‌ అనేది విలువైన మెటల్‌కు ఒక స్వచ్చత ధ్రువీకరణ పత్రం. వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నియంత్రణలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్ట్స్‌ (బీఐఎస్‌) హాల్‌మార్కింగ్‌ నిర్వహణాపరమైన అధికారాన్ని కలిగి ఉంది. వరల్డ్‌

Most from this category