STOCKS

News


రూపీ పైపైకి..

Tuesday 18th December 2018
Markets_main1545107521.png-23017

  • అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.34 వద్ద ట్రేడవుతోన్న ఇండియన్‌ కరెన్సీ

ఇండియన్‌ రూపాయి సోమవారం లాభాలను మంగళవారం కూడా కొనసాగిస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి లాభాలతో ప్రారంభమైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు పాలసీ రేట్ల సమావేశం నేపథ్యంలో డాలర్‌ బలహీనపడటం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో రూపాయి 71.34 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (సోమవారం) స్థాయి 71.55తో పోలిస్తే 0.30 శాతం లాభపడింది. ఇకపోతే రూపాయి మంగళవారం 71.33 వద్ద ప్రారంభమైంది. 

అమెరికా ఫెడరల్‌ రిజర్వు బుధవారం నాటి సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఫెడరల్‌ రిజర్వు ఏం చెబుతుంది? అమెరికా వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు వంటి అంశాలపై ట్రేడర్లు దృష్టి కేంద్రీకరించారు. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.426 శాతం వద్ద ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.461 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 6.5 శాతం పెరిగింది. ఇక ఇదే సమయంలో రూపాయి 10.74 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.44 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్ల నుంచి 7.34 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 

ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియా 0.46 శాతం, జపాన్‌ యెన్‌ 0.23 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.2 శాతం, థాయ్‌ బట్‌ 0.14 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.13 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.1, చైనా రెన్‌మిన్‌బి 0.1 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.09 శాతం పెరిగాయి. 

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 97.10తో పోలిస్తే 0.02 శాతం క్షీణతతో 97.08 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

ఇళ్ల క్రయవిక్రయాల్లోకి ‘ఎస్సెక్స్‌’

Tuesday 18th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇల్లు కొనుక్కోవటం అంత ఈజీ కాదు. అనువైన ప్రాంతంలో కావాలంటే కాళ్లరిగేలా తిరగాలి. మరోవంక సదరు ఇంటిని అన్ని అనుమతులు తీసుకున్నాకే బిల్డర్‌ నిర్మించారా? లోన్‌ వస్తుందా అన్న సందేహాలూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా... ఒక్క క్లిక్‌తో సులువుగా ఇల్లు కొనుక్కునేలాంటి సేవల్ని అందుబాటులోకి తెచ్చింది ‘ఎస్సెక్స్‌’ దేశంలో అతిపెద్ద మార్కెటింగ్‌ టెక్నాలజీ కంపెనీ వే2ఆన్‌లైన్‌ ఇంటెరాక్టివ్‌ ప్రమోట్‌ చేస్తున్న ‘ఎస్సెక్స్‌ ఇండియా’... టెక్నాలజీని ఆసరాగా

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టాటాస్టీల్‌:- జర్మన్‌ ఉక్కు దిగ్గజం థీస్సెన్‌క్రూప్‌ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి సీఈవోగా ఆండ్రియాస్‌ గాస్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ఏర్పాటు కాబోతున్న థీస్సెన్‌క్రూప్‌టాటాస్టీల్‌ బి.వి.కి సంబంధించిన మేనేజెమెంట్‌ బోర్డు సభ్యులను నియమించినట్లు టాటాస్టీల్‌ ఎక్చ్సేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఎన్‌ఎండీసీ:- ఐరన్‌ ఓర్‌ ధరలను పెంచింది. టన్ను లూప్‌ ఓర్‌ ధర రూ.3250 కోట్లు, ఫైన్స్‌ ఓర్‌ ధర రూ.2870లుగా

Most from this category