STOCKS

News


నిలువునా పతనమైన రూపాయి..

Monday 13th August 2018
Markets_main1534133208.png-19194

భారత్‌ కరెన్సీ రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపోయింది. కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి క్షీణించింది. టర్కీ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:13 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 69.46 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు 68.84తో పోలిస్తే ఏకంగా 0.9 శాతం (63పైసలు) క్షీణించింది. ఇక రూపాయి సోమవారం 69.49 వద్ద ప్రారంభమైంది. ఇది రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయి. డాలర్‌తో పోలిస్తే టర్కీ లిరా ఏకంగా 12.5 శాతంమేర పతనమైంది. టర్కీ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తుండటం ఇందుకు కారణం. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.802 శాతంగా ఉంది. శుక్రవారం నాటి ముగింపు స్థాయి 7.754 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ సోమవారం మార్నింగ్‌ సెషన్‌లో 164 పాయింట్ల నష్టంతో 37,704 పాయింట్లకు క్షీణించింది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ దాదాపు 11.65 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 7.7 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 260 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 5.43 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
జూన్‌ నెల సీపీఐ (వినియోగదారులు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు) ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రూపియ 0.9 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.62 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.49 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.35 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.31 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.29 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.19 శాతం, థాయ్‌ బట్‌ 0.19 శాతం, మలేసియా రింగిట్‌ 0.16 శాతం క్షీణించాయి. జపాన్‌ యెన్‌ మాత్రమే 0.59 శాతం పెరిగింది.
ఇతర దేశాల కరెన్సీతో అమెరికా డాలర్‌ పటిష్టతను తెలియజేసేత డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 96.357తో పోలిస్తే 0.06 శాతం పెరుగుదలతో 96.412 వద్ద ఉంది. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 13th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- ఈ బ్యాంకు డిప్యూటీ ఎం.డీ. ప్రకాష్‌ సుక్తంకర్‌ రాజీనామా చేశారు. అశోక్‌ లేలాండ్‌:- బ్రిటన్‌ తన అనుబంధ సంస్థ ఒప్టరే ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ వాహనాలను తయారుచేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది. ఎన్‌బీసీసీ:- సెంట్రల్‌ బోర్డు ఆప్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌(హెచ్‌బీఎస్‌ఈ) నుంచి రూ.150 కోట్ల విలువైన ఆర్డర్లును దక్కించుకుంది. యూనివర్సల్‌ కేబుల్స్‌:- జర్మని ఆధారిత కేబుల్‌ కంపెనీ ఎన్‌కేటీ సంస్థతో భాగస్వామ్య ఒ‍ప్పందాన్ని

మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌

Monday 13th August 2018

అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,869 పాయింట్లతో పోలిస్తే 176 పాయింట్ల నష్టంతో 37,693 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,429 పాయింట్లతో పోలిస్తే 60 పాయింట్ల నష్టంతో 11,369 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 

Most from this category