STOCKS

News


మరింత బలపడిన రూపీ

Friday 30th November 2018
Markets_main1543552197.png-22501

ఇండియన్‌ రూపాయి లాభాల ఇన్నింగ్స్‌ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.18 శాతం పెరుగుదలతో 69.72 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌ 10 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. రూపాయి గురువారం ముగింపు స్థాయి 69.85గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.69 వద్ద ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు క్షీణించడం కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వచ్చే ఏడాది రేట్ల పెంపు నెమ్మదిగా ఉండొచ్చనే అంచనాలు సానుకూల ప్రభావం చూపాయి. మరోవైపు శుక్రవారం సాయంత్రం క్యూ2 జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.625 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.608 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 6.21 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 8.9 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.20 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.62 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు దాదాపుగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.74 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.13 శాతం, జపాన్‌ యెన్‌ 0.11 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.04 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.04 శాతం పెరిగాయి. అయితే మలేసియా రింగిట్‌ 0.09 శాతం క్షీణించింది. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.778తో పోలిస్తే 0.05 శాతం క్షీణతతో 96.727 వద్ద ట్రేడవుతోంది. 
ఎన్‌ఎస్‌ఈలో గత సెషన్‌లో డాలర్‌-రూపాయి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ 70.10 వద్ద ఉంది. గత సెషన్‌లో డిసెంబర్‌ క్వార్టర్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.5 శాతం మేర క్షీణించిందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. 



You may be interested

ఫ్లాట్‌గా పసిడి ధర

Friday 30th November 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా శుక్రవారం పసిడి ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 0.30డాలర్ల స్వల్ప నష్టంతో  1,230.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ కదులుతోంది. అర్జెంటీనాలో నేడు, రేపు జరగనున్న జీ-20 సదస్సులో వాణిజ్య యుద్ధంపై అగ్రరాజ్యాధిపతులైన ట్రంప్‌- జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. దీంతో పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ 96.79 వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది.

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 30th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎన్‌బీఎస్‌సీ షేర్లు:- ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య లభత్యను పెంచేందుకు ఆర్‌బీఐ చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీల సెక్యూరిటైజేషన్ లావాదేవీల నిబంధనలను సవరించడంతో పాటు కనీస హోల్డింగ్‌ కాలపరిమితిని 5ఏళ్లకు పెంచింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో నేడు ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, భారత్‌ ఫైనాన్స్‌, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం

Most from this category