STOCKS

News


3 నెలల గరిష్టానికి రూపీ

Thursday 29th November 2018
Markets_main1543467610.png-22465

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం మరింత బలపడింది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.75 శాతం పెరుగుదలతో 70.09 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 70.62గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.17 వద్ద ప్రారంభమైంది. 
ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యల వల్ల డాలర్‌ బలహీనపడింది. కేంద్ర బ్యాంక్‌ బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్లు తటస్థ స్థాయికి దగ్గరిలో ఉన్నాయని పావెల్‌ తెలిపారు. దీని వల్ల భవిష్యత్‌లో రేట్ల పెంపులో వేగం ఉండకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో బుధవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు కూడా గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.608 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.643 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4.87 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 8.9 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.20 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.62 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.98 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.4 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.27 శాతం, జపాన్‌ యెన్‌ 0.27 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.19 శాతం, మలేసియా రింగిట్‌ 0.17 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.16 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.07 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.786తో పోలిస్తే 0.01 శాతం పెరుగుదలతో 96.789 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

మార్కెట్లకు పావెల్ బూస్ట్‌

Thursday 29th November 2018

న్యూయార్క్: స్టాక్‌ మార్కెట్లకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. వడ్డీ రేట్లకు సంబంధించి ఈయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లన్నీ లాభాలను నమోదుచేశాయి. ‘అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు తటస్థ స్థాయిలో ఉన్నాయనే అంచనాలు విస్తృత పరిధిలో ఉండగా..ఇంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవడానికి కానీ,

ఆరంభం అదిరింది..

Thursday 29th November 2018

10,800 పాయింట్లకు పైన నిఫ్టీ 36,000 సమీపంలో సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,728 పాయింట్లతో పోలిస్తే 80 పాయింట్ల లాభంతో 10,808 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,716 పాయింట్లతో పోలిస్తే 281 పాయింట్ల లాభంతో 35,997 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. భారత్‌ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 7.6 శాతానికి తగ్గొచ్చని యాక్సిస్‌

Most from this category