STOCKS

News


ఆగని ర్యాలీ...70 స్థాయికి రూపాయి

Thursday 7th March 2019
Markets_main1551952385.png-24472

డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం ఇంట్రాడేలో మరో 33పైసలు బలపడింది. నేడు రూపాయి గత ముగింపు(70.27)తో పోలిస్తే 19 బలపడి 70.08 వద్ద ప్రారంభమైంది. అమెరికా క్రూడాయిల్‌ ఉత్పత్తి, నిల్వలు రికార్డు చేరుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల క్షీణించడటం, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు రూపాయి బలపడేందుకు తోడ్పడ్డాయి. డాలర్‌ బలహీనపడంతో ఫారెక్స్‌ మార్కెట్లో బ్యాంకర్లు, ఎగుతిదారులు, డీలర్లు డాలర్‌ అమ్మకాలకు ఎగబడంతో రూపాయి విలువ దూసుకుపోయింది. దేశ ఈక్విటీ మార్కెట్‌ ప్రారంభం తర్వాత మరింత పుంజుకొని 33పైసలు బలపడి 70స్థాయికి దిగువన 69.94 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు గత ముగింపుతో పోలిస్తే 24పైసల లాభంతో 70.03 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడాయిల్‌ పతనంతో పాటు అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలమయ్యే దిశగా సాగుతుండం దేశీయ కరెన్సీకి కలిసొచ్చింది. 



You may be interested

డిసెంబరుకల్లా 42,000 స్థాయికి సెన్సెక్స్‌

Thursday 7th March 2019

మోర్గాన్‌స్టాన్లీ అంచనా జీడీపీ డేటాతో సహా ఆర్థిక గణాంకాలన్నీ నిరుత్సాహకరంగా వున్నా, ఇండో–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా కీలకమైన స్థాయిల్ని సూచీలు పరిరక్షించుకున్నాయని, ఇప్పుడు ఎన్నికల ముందస్తు ర్యాలీ జరుగుతున్నదని నిపుణులు చెపుతున్నారు. నెలరోజుల తర్వాత ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000 స్థాయిని అధిగమించి, మూమెంటమ్‌ కనపరుస్తుందని, ఎన్నికలకు ముందుగానే మరిన్ని అవరోధాల్ని సూచీలు అధిగమిస్తాయని వారు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా సెన్సెక్స్‌ 42,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని ప్రముఖ

మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Thursday 7th March 2019

స్తబ్దుగా సాగుతున్న మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గురువారం ఇంట్రాడేలో ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3021.30)తో పోలిస్తే అరశాతానికి పైగా నష్టంతో 3,000.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే జేఎస్‌ఎల్‌హిస్సార్‌, వేదాంత, నాల్కో షేర్లు 1.50శాతం

Most from this category