STOCKS

News


ఆఫ్‌షోర్‌లో రూపీ అప్‌

Saturday 27th October 2018
Markets_main1540617338.png-21526

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి బలపడింది. 73.17 స్థాయికి లాభపడింది. ఒకానొక సమయంలో 73.08 స్థాయికి కూడా పెరిగింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా రూపాయి శుక్రవారం ఇండియన్‌ మార్కెట్‌లో 20 పైసలు క్షీణించి 73.47 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడటం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తరలి వెళ్లిపోవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఇక రూపాయి గురువారం 11 పైసలు క్షీణించి 73.27 వద్ద ముగిసింది.  
 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి..

Saturday 27th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,115 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,054 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

13 కోట్ల చ.అ. 310 గ్రీన్‌ బిల్డింగ్స్‌!

Saturday 27th October 2018

సాధ్యమైనంత వరకూ సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిద్యాన్ని కాపాడే నిర్మాణాలకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హరిత భవనాలుగా గుర్తిస్తుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే గ్రీన్‌ బిల్డింగ్స్‌ ప్రధాన ఉద్దేశం. ఐజీబీసీ రేటింగ్స్‌ ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తో పాటూ బేసిక్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉంటుంది. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్‌ స్కేపింగ్‌

Most from this category