STOCKS

News


85 పైసలు బలపడిన రూపాయి

Friday 2nd November 2018
Markets_main1541149503.png-21667

  • 72 స్థాయి దిశగా రూపాయి కదలికలు

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక్కసారిగా పుంజుకుంది. ఇంట్రాడేలో 85 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయానికి 72.60 వద్దకు చేరుకుంది. గురువారం నాటి మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 50 పైసలు బలపడి 73.45 వద్ద ముగిసిన రూపాయి విలువ.. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు ధరలు పతనం కావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో రోజులోనే 85 పైసలు కోలుకుంది. సెప్టెంబరు 11 నాటి స్థాయికి రికవరీ సాధించింది. సప్లై పెరిగిన కారణంగా గడిచిన ఐదు సెషన్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 6 శాతం మేర పతనం కావడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) భారత స్టాక్‌ మార్కెట్‌లో గురువారం 348 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపడం,  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు లాభపడడం వంటి ప్రధాన అంశాల నేపథ్యంలో రూపాయి పుంజుకుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు వివరించారు. 



You may be interested

మెరుస్తున్న మెటల్‌ షేర్లు

Friday 2nd November 2018

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా శుక్రవారం మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు 3శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 3శాతం లాభపడి 3,469.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ ఈ ఇండెక్స్‌లో మొత్తం 15 షేర్లలో 13 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌, వేదాంత 6శాతం ర్యాలీ చేశాయి. జిందాల్‌స్టీల్‌ 5శాతం,

దాల్మియా భారత్ టార్గెట్‌ రూ.3,100

Friday 2nd November 2018

కంపెనీ: దాల్మియా భారత్ లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.2,212 (నవంబర్‌ 2, 2018న) టార్గెట్‌ ధర: రూ.3,100 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.3,350 /1,930 దాల్మియా భారత్ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద

Most from this category