STOCKS

News


బలపడిన రూపాయి

Tuesday 6th November 2018
Markets_main1541478481.png-21732

  • 17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభం

ఇండియన్‌ రూపాయి మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ ఆరంభించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభమైంది. బ్యాంకులు, ఎగుమతిదారులు.. అమెరికా డాలర్లను విక్రయించడం ఇందుకు కారణం. కాగా రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 67 పైసలు క్షీణించి 73.12 వద్ద క్లోజయ్యింది. రెండు సెషన్లలో బలపడుతూ వచ్చిన ఇండియన్‌ రూపాయి సోమవారం రోజు తీవ్ర ఒత్తిడికి గరయ్యింది. అమెరికా మధ్యంతర ఎన్నికలు, ఎఫ్‌వోఎంసీ పాలసీ సమావేశం వంటి అంశాలు ప్రభావం చూపాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. అలాగే ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరల కదలికలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో తలెత్తాయని పేర్కొంది. మంగళవారం రోజు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 72.70- 73.30 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. ఇకపోతే భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.8 శాతంగా ఉన్నాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 6th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు విప్రో:- వ్యాపార కార్యకలాపాల కోసం చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌తో జట్టు కట్టనుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- డచ్‌ బ్యాంక్‌కు సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించేందుకు ఒప్పందాన్ని కుదర్చుకుంది. హిందూస్థాన్‌ కన్‌స్ట్రక్చన్స్‌:- రూ.500 కోట్ల విలువైన రైట్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. నవంబర్‌ 12న రైట్స్‌ ఇష్యూ కమిటి సమావేశం జరగనుంది. ఆంధ్రా బ్యాంక్‌:- ఏఎస్‌ఆర్‌ఈసీ, ఇండియా ఇంటెల్‌ బ్యాంక్‌, ఇండియాఫస్ట్‌లైఫ్‌ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటా ఉపసంహరణకు బోర్డు

35,000 పైన సెన్సెక్స్‌

Tuesday 6th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,524 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల లాభంతో 10,552 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,950 పాయింట్లతో పోలిస్తే 126 పాయింట్ల లాభంతో 35,076 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగానే ట్రేడవుతుండటం (సింగపూర్‌ మార్కెట్‌కు మాత్రం

Most from this category